Tuesday, April 23, 2024
- Advertisement -

తెలుగోడి అన్నదమ్ముల బంధం భలే గట్టిది….

- Advertisement -

తెలుగు పరిశ్రమలో ఉన్న అన్నదమ్ముల అనుబందం… మరే భాషలోను లేదు.ఇక్కడ అన్నగారు ఫామ్ లో ఉంటే తమ్ముడు,తమ్ముడు ఫామ్ లో ఉంటే అన్నగారు ఒకరి కష్టాల్లో మరొకరు పాలు పంచుకుంటూనే ఉన్నారు.

దీంతో టాలీవుడ్ కు అన్నదమ్ముల బందం భాగా వంట బట్టింది.అంతెందుకు తాజాగా జరుగుతున్న ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ విషయమే తీసుకుందాం.వీరిద్దరు గతంలో ఎలా ఉన్నా…ఇపుడు మాత్రం నాకు నీవు, నీకు నేను అన్నట్లుగా ఉన్నారు.కిక్ 2,షేర్ ఆడియో లాంచ్ టైమ్లో మనకు ఇది భాగా కనిపించింది. 

 తారక్ ,కళ్యాణ్ రామ్ అనే కాదు.అప్పట్లో చిరంజీవి,నాగబాబుల బందం కూడా ఇలానే హైలెట్ అయింది.చిరు వేసే ప్రతి స్టెప్ లోను నాగబాబు కనిపించేవారు. కొన్ని చిత్రాల్లో అయితే చిరుతో వచ్చి ఖాలీగా కూర్చోలేక సినిమాల్లో వేషాలు కూడా వేసారు.ఇక వెంకటేష్ ను ముందునుంచి సపోర్ట్ చేస్తూ… అతని ప్రతి విజయంలోను  సురేష్ బాబు కనిపిస్తారు.విక్టరీ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ సురేష్ బాబు తన తమ్ముడు వెన్నంటే ఉన్నారు.

ఇక నాగార్జున ఫ్యామిలీ విషయానికొచ్చినా… మనకు ఇదే అనుబందం  కనిపిస్తుంది.అక్కినేని వెంకట్ నటుడిగా ఎంట్రీ ఇవ్వకపోయినా….తన తమ్ముడు విజయాల వెనుక అతనే ఉన్నాడు.

ఆరోజున శివ సినిమాను వెంకట్ ఓకే చెప్పకపోతే…. నాగ్ కు మాస్ లో ఈ స్థాయి ఇమేజ్ వచ్చేదా అనేది సందేహమే.అలాగే కృష్ణ విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన తమ్ముడు ఆది శేషగిరిరావు, కృష్ణంరాజు తమ్మడు సూర్యనారాయణ రాజు తన అన్నల కోసం పడిన కష్టం మరువలేనిది. ఏది ఏమైనా హీరోలకు తమ బ్రదర్స్ ఇస్తోన్న మోరల్ సపోర్ట్ చూస్తుంటే..భలే ముచ్చటేస్తోంది.

కొసమెరుపు: ఇదే యాంగిల్ ను కోలీవుడ్ కు అప్లై చేస్తే…. కమల్ హాసన్ ఎదుగుదల కోసం చారుహాసన్ చేసిందేమి లేదు.అలాగని కమల్ అతన్ని రానిచ్చాడని చెప్పలేం.

విశాల్ ,విక్రమ్ కృష్ణ స్టోరీ కూడా ఇంతే.ఇపుడు ఎవ్వరికి వారు వేరు కుంపటి.ఏదో సూర్య విషయంలో మాత్రమే అన్నదమ్ముల అనుబంధం కనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -