Monday, April 29, 2024
- Advertisement -

డ్రెస్ విప్పేది లేదంటోన్న పవన్ కళ్యాణ్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా…. సమ్ థింగ్ స్పెషల్ గానే ఉంటుంది.అయితే అతను ఈసారి వేస్తోన్న స్టెప్ లో అతని వే ఆఫ్ అప్రోచ్ ,గెటప్ పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ తాజా ముచ్చట్లు చూస్తే…. కామెడీ కాస్త  ఎక్కువగా కనిపిస్తుంది.ఒక్క పవర్ స్టార్ అనే కాదు ఎంటైర్ మెగా కాంపౌండ్ వేసే ప్రతి స్టెప్ ఒకే ధోరణిలో ఉంటుంది.

విషయంలోకి వస్తే…పవన్ పోలీసు డ్రెస్ వేసుకుని మంత్రులు, ప్రముఖుల‌తో పోటోలు దిగ‌డం, చివ‌ర‌కు సెట్‌లో నుంచి అన్నయ్య ఇంటికి పోవ‌డానికి కూడ మేక‌ప్ వేసుకుని అదే డ్రేస్‌తో తిరుగుతుండ‌టం చూసిన వారు ..పవన్ పై జోకులు పేల్చుకుంటున్నారు.అంతా పవన్ క‌ళ్యాణ్ సర్దార్ పాత్రలో లీనమైపోయినట్టున్నాడు అంటున్నారు.

అతను ఎక్కడికెళ్లినా ఆయన ఖాకీని వదలడమే లేదు. వారం రోజులుగా పవన్ కళ్యాణ్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాడు. ప్రతీ చోటా ఖాకీ డ్రెస్సులోనే దర్శనమిస్తున్నాడు. ఇది సర్దార్ గబ్బర్ సింగ్ గెటప్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా ఏ హీరో అయినా సినిమాలో నటిస్తున్నప్పుడు తన గెటప్ బయటికి రాకుండా చూసుకొంటుంటారు. సెట్లో తప్ప బయట ఎక్కడా గెటప్లో కనిపించరు. కానీ పవన్ మాత్రం అందుకు భిన్నంగా ఎప్పుడూ సర్దార్ గబ్బర్ సింగ్ గెటప్లోనే కనిపిస్తున్నాడు.

ముందుగా శంకరాభరణం టీజర్ని ఇదే గెటప్ తో రిలీజ్ చేశాడు  అదంటే సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లోనే జరిగిన వేడుక కాబట్టి కాస్ట్యూమ్స్ లోనే ఉన్నాడనుకొందాం. కానీ ఆ తర్వాత పవన్ని రాష్ట్ర మంత్రులు కలిసి అమరావతి శంఖుస్థాపనకి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అక్కడ కూడా పవన్ సర్దార్ గెటప్లోనే దర్శనమిచ్చాడు. ఆ గెటప్లోనే మీడియాతో మాట్లాడాడు. సాధారణంగా పవన్ని కలవడానికి రాష్ట్ర మంత్రులు వస్తున్నారంటే ముందస్తుగా సమాచారం అందుతుంది. అప్పుడైనా ఆయన డ్రస్ ఛేంజ్ చేసుకోవచ్చు. కానీ పవన్ మాత్రం ఖాకీని వదల్లేదు. 

అన్నయ్య చిరంజీవిని పవన్ ఇంటికెళ్లినప్పుడు కూడా…. 150 రోజా పూలతో కూడిన బొకేతో తన అన్నను  సత్కరించాడు. అయితే అక్కడికి కూడా పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ గెటప్లోనే వచ్చాడు. ఇంటికి కూడా పవన్ సినిమా గెటప్లో రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -