Sunday, May 19, 2024
- Advertisement -

బిగ్‌బాస్ 3లో సంద‌డి చేయ‌నున్న శ్రీముఖి

- Advertisement -

తెలుగు లో ఎంతో పాపులారిటీ సంపాదించిన కార్యక్రమాల్లో ‘పటాస్’ఒకటి. ఈ కార్యక్రమంలో రాములమ్మగా నటి శ్రీముఖ యాంకరింగ్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఒక ర‌కంగా చెప్పాలంటె ఈ షోకు శ్రీముఖి యాంకరింగ్, ఆమె అందాలే పెద్ద అస్సెట్‌గా నిలుస్తూ వచ్చాయి. మొదట్లో ఈ ప్రోగ్రామ్ పై పలు విమర్శలు వచ్చినా..తర్వాత బుల్లితెర ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే… అనసూయ, రష్మిల తర్వాత గ్లామర్ తీసుకొచ్చిన యాంకర్స్ లో శ్రీముఖి కూడా చేరిపోయింది.

‘పటాస్’ షో నుండి కొన్ని రోజులు విరామం తీసుకొవాలని భావిస్తోంది శ్రీముఖి. అయితే ‘పటాస్’ షోకు ప్రధాన ఆకర్షణ శ్రీముఖి. తన అందం, అల్లరితో షోను పరుగులు తీయించడమే కాదు, తన గ్లామర్‌తో కొత్త అందాన్ని తీసుకొచ్చింది. అయితే ఉన్న‌ట్టుండి ఈ ప్రోగ్రామ్ నుంచి శ్రీముఖి త‌ప్పుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. స్వ‌యంగా శ్రీముఖే ఈ షోనుంచి కొన్ని రోజులు త‌ప్పుకుంటున్న‌ట్లు ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ఈ షోనుంచి ఎందుకు త‌ప్పుకుంద‌ని ఆరా తీయ‌గా శ్రీముఖికి ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగులో బిగ్ బాస్ రెండు సీజన్ లను పూర్తి చేసుకొని మూడో సీజన్ కి సిద్ధమవుతుంది. జూలై నెల రెండో వారం నుండి ఈ షో ప్రారంభం కానుంది. శ్రీముఖికి ‘బిగ్ బాస్ 3’ సీజన్‌లో పాల్గొనే అవకాశం వచ్చిందట. ఆ షోలో పాల్గొనడం కోసమే శ్రీముఖి బ్రేక్ తీసుకుందనేది సమాచారం. అందుకే కొన్నాళ్లపాటు శ్రీముఖి ‘పటాస్’కి బ్రేక్ ఇచ్చింది బిగ్ బాస్ షో కోసమే అంటూ వార్తలు ఊపందుకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -