Wednesday, May 15, 2024
- Advertisement -

‘ఏబీసీడీ’ రివ్యూ

- Advertisement -

చిత్రం: ఏబీసీడీ
నటీనటులు: అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, నాగబాబు, మాస్టర్ భరత్, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్ తదితరులు
సంగీతం: జుడా శాండీ
ఛాయాగ్రహణం: రామ్
ఎడిటింగ్‌: నవీన్ నూలి
నిర్మాతలు: మధురా శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
బ్యానర్: మధురా ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ: 17/05/2019

ఈ మధ్యనే ‘ఒక్క క్షణం’ అనే సినిమాతో మరొక డిజాస్టర్ ను అందుకున్న యువ హీరో అల్లు శిరీష్ తాజాగా ‘ఏబిసిడి అమెరికన్ బోర్న్ కంఫుజ్డ్ దేశీ’ అనే మలయాళం సినిమా రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఇవాళ అనగా మే 17న విడుదలైంది. మధుర శ్రీధర్ రెడ్డి మరియు యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జూడా శాండీ సంగీతాన్ని అందిస్తున్నారు. వరుస ప్లాపులతో సతమతమైన అల్లు శిరీష్ కు ఈ సినిమా ఎంతవరకు హిట్ అందిస్తుందో చూద్దామా..

కథ:

అవి (అల్లు శిరీష్) అమెరికాలో ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న బాగా డబ్బున్న భారతీయుడు. ఒకరోజు అవి అతని స్నేహితుడు (మాస్టర్ భరత్) ఇండియాకి తిరిగి రావాల్సి వస్తుంది. అక్కడికి వచ్చాక అది అవి తండ్రి (నాగబాబు) వేసిన ప్లాన్ అని అర్థమవుతుంది. అసలు అవి తండ్రి అతనిని ఇండియా కి ఎందుకు రప్పించినట్లు? విదేశంలో పుట్టి పెరిగిన అవి మరియు అతని స్నేహితుడు భారతదేశంలో ఎలాంటి కష్టాలు అనుభవించారు? చివరికి ఏం జరిగింది అనేది సినిమా కథ.

నటీనటులు:

అల్లు శిరీష్ నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇదివరకు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా లో అల్లు శిరీష్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ మీద కూడా అల్లు శిరీష్ బాగానే ఇంప్రూవ్మెంట్ చూపించాడు. రుక్సర్ ధిల్లాన్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది. కేవలం అందంతో మాత్రమే కాక తన అద్భుతమైన నటనతో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. నాగ బాబుకి ఈ సినిమాలో ఒక మంచి పాత్ర దక్కింది. ఎప్పటిలాగానే తన పాత్రకు న్యాయం చేశారు నాగబాబు. మాస్టర్ భరత్ కామెడీ బావుంది. అల్లు శిరీష్ పక్కనే ఉంటూ కామెడీని బాగానే పండిస్తాడు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ కచ్చితంగా ప్రేక్షకులలో నవ్వులు తెప్పిస్తుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

రీమేక్ సినిమా అయినప్పటికీ ఉన్నది ఉన్నట్టు దింపకుండా తెలుగు నెటివిటీకి సరిపోయేలా గా కథలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. అయితే ఒరిజినల్ సినిమా లాగానే ఈ సినిమా కూడా కేవలం ఎంటర్ టైన్ మెంట్ మీద ఆధారితమైన ఉంటుంది. అనుకున్న విధంగానే ఈ సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటుంది. కామెడీ విషయంలో దర్శకుడు సంజీవ్ రెడ్డి సినిమాను చక్కగా తెరకెక్కించారని చెప్పవచ్చు. మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని పంపించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. జూడా శాండీ అందించిన సంగీతం ఈ సినిమాకు బాగానే వర్కౌట్ అయింది. పాటలు పక్కన పెడితే సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ రామ్ మంచి విజువల్స్ ను అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

తీర్పు:

సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. మొదటి హాఫ్ మొత్తం సినిమాలో కేవలం ఎంటర్టైన్మెంట్ మీద మాత్రమే దృష్టి పెట్టారు దర్శకుడు. జోనర్ కి తగ్గట్టు గానే మొదటి భాగం మొత్తం కామెడీ మరియు కొంత రొమాన్స్ తో నిండిపోయి ఉంటుంది సినిమా. ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. మొదటి రెండవ హాఫ్ తో కంపేర్ చేస్తే రెండవ భాగంలో కొన్ని సెంటిమెంటల్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. క్లైమాక్స్ కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుంది. ఓవరాల్ గా అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ సినిమా ఒక మంచి రీమేక్. ఒరిజినల్ వెర్షన్ కు న్యాయం చేస్తూ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -