Friday, May 3, 2024
- Advertisement -

నాగ చైతన్య ప్రేమమ్ ఫస్ట్ లుక్

- Advertisement -

గత వారం రోజులుగా నాగ చైతన్య నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ కోసం అక్కినేని అభిమానులు ఎంత గానో ఎదురు చూసారు. ఇప్పుడు అక్కినేని అభిమానులకు ఓ శుభ వార్త వచ్చింది. నాగా చైతన్య ప్రస్తుతం మళయాలంలో సూపర్ హిట్ కొట్టిన ‘ప్రేమమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

చైతన్యకు 12వ సినిమా తెరకేక్కుతున్న ఈ చిత్రాన్నికి ’మజ్ను’  అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ద్వారా తెలిసిపోయింది ఈ సినిమాకి కూడా ప్రేమమ్ అనే టైటిల్ పిక్స్ చేశారు అని. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే ఖచ్చితంగా తెలుగులో కూడా భారీ హిట్ అవుతుందనిపిస్తుంది.

‘ప్రేమమ్’ సినిమా మూడు విభిన్న ప్రేమ కథలు కావడంతో సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చైతన్య సరసన శృతి హాసన్ తో పాటు, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమ కథ సినిమాలో నటించడం చైతన్యకి బాగా తెలుసు. సో మలయాళంలో రిలీజైన ‘ప్రేమమ్’ చిత్రం సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా అదే రేంజ్‍లో హిట్ అవుతుందని అక్కినేని అభిమానులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -