Friday, May 3, 2024
- Advertisement -

‘కృష్ణాష్టమి’ మూవీ రివ్యూ

- Advertisement -

భీమవరం బుల్లోడు సినిమా తరవాత చుట్టుపక్కల ఎక్కడా కనపడని సునీల్ ఇక హీరోగా విరమించుకున్నాడు అని అన్నారు అందరూ, వరసగా సినిమాలు తీస్తూ అడపా దడపా హిట్ లు కొడుతున్న ఈ హీరో టర్న్ కమీడియన్ సడన్ గా మళ్ళీ ‘ కృష్ణాష్టమి ‘ తో తెరమీద దర్సనం ఇచ్చాడు.

జోష్ సినిమాతో మొదటి సినిమా దెబ్బ తిన్న వాసు వర్మ తన మొదటి నిర్మాత దిల్ రాజు తోనే ఈ సినిమా నిర్మించడం విశేషం. సునీల్ – వాసు వర్మ ల భవిష్యత్తు ని ఎ సినిమా ఏ మలుపు తిప్పిందో చూద్దాం.

 

కథ – పాజిటివ్ లు:

సునీల్ – కృష్ణ ప్రసాద్ 18 సంవత్సరాల తరవాత యూఎస్ నుంచి ఇండియా రావాలి అని అనుకుంటాడు . ఇక్కడ పరిస్థితి బాలేదు అనీ రావద్దు అనీ చెప్పినా వినకుండా అతను బయలుదేరతాడు. ఇన్దిఆ రాగానే అతనిమీద అటాక్ జరగడం అజయ్ కుమార్ ( అజయ్) సునీల్ ని  కాపాడే క్రమం లో  అజయ్ కోమాలోకి వెళ్ళడం ఇదంతా జరుగుతుంది. సునీల్ మీద అటాక్ చేసింది ఎవరూ అసలు సునీల్ ని ఎవరు చంపాలి అనుకున్నారు లాంటి విషయాలు సినిమాలో చూడాల్సిందే. సునీల్ ఈ సినిమా కి హై లైట్ అని చెప్పాలి. డాన్స్ ల విషయం లో కానీ పెర్ఫార్మన్స్ విషయంలో కానీ చాలా చక్కగా చేసాడు. ఇదివరకు రోమాన్స్ విషయంలో ఇబ్బందులు పడే సునీల్ ఈ సారి ఇంప్రూవ్ అయినట్టు అనిపించాడు. ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ గా ఆసక్తికరంగా వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమా మొత్తానికే హై లైట్ అయ్యింది. అక్కడ వచ్చే ట్విస్ట్ అసలు ఊహించలేనిది గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం డైరెక్టర్ ఈ కథ రాసుకున్నాడు అని ఇట్టే చెప్పచ్చు. 

 

నెగటివ్ లు :

ఈ సినిమా లో పెద్ద నెగెటివ్ సెకండ్ హాఫ్ అని చెప్పాలి. మొదటి భాగంలో చూపించిన ఆ ఆసక్తి సెకండ్ కి వచ్చే సరికి కనపడలేదు అనేది గట్టిగా చెప్పచ్చు . సెకండ్ హాఫ్ లో కథని పక్కకి పెట్టేసి సినిమా మొత్తం కామెడీ తో లాగేయడానికి చూసారు డైరెక్టర్. అది కూడా సరిగ్గా పండకపోవడం తో సెకండ్ హాఫ్ భారీ తలనొప్పిగా మారిపోయింది. స్క్రీన్ ప్లేయ్ అసలు ఆసక్తికరంగానే లేకుండా పోయింది. కథనం చెప్పడం లో వాసూ వర్మ మళ్ళీ జోష్ లాగానే ఫయిల్ అయ్యాడు. సన్నివేశాలు బాగా సాగదీసినట్టు అనిపిస్తాయి. ఎమోషన్స్ కూడా సరిగ్గా పండనేలేదు. పస లేకుండా పోవడం తో కృష్ణాష్టమి పండగ లాగా అనిపించకుండా రొటీన్ గా అనిపిస్తుంది. 

 

మొత్తంగా చూస్తే .. 

గత పదేళ్ళ కాలం లో మనం చూస్తున్న అదే సినిమాని ఇటు తిప్పీ అటు తిప్పీ తీసేసాడు డైరెక్టర్ వాసు వర్మ. ఈ మాత్రం దానికి మూడేళ్ళు స్టోరీ మీద కూర్చోవాల్సిన అవసరం ఎమొచ్చిందో ఆయనకే తెలియాలి. కామెడీ సరిగ్గా హ్యాండిల్ చేసి ఉంటే రొటీన్ అయినా కాస్త పేలి ఉండేది. మూస కథలు చూసి చూసీ అలవాటి పడిపోయిన జనాలకి ఇది ఇంకా మూసగా కనిపిస్తుంది. స్టార్ హీరో అయ్యే ఆలోచనతో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేసే ప్రయత్నంలో సునీల్‌తో పాటు ‘కృష్ణాష్టమి’ టీమ్ మొత్తం అసలు ‘కమర్షియల్’ అనే విషయాన్ని పక్కదారి పట్టించింది. లాజిక్ లేని సీన్ లు కూడా అక్కడక్కడా చాలా విసిగిస్తాయి. మరీ బోర్ కొడితే వీకెండ్ లో ఒక్కసారి వెళ్ళచ్చు కానీ కచ్చితంగా ఆసక్తికరంగా వెళ్లి మరీ చూడాల్సిన సినిమా మాత్రం కాదు. 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -