విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వేడుకల ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నాయి. రష్మిక షేర్ చేసిన వెడ్డింగ్ పోస్టులు ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ పెళ్లి సందడి ఇంకా తగ్గలేదు.
ఈ వేడుకల్లో పాల్గొన్న నటి ఈషా రెబ్బా,తరుణ్ భాస్కర్ తో కలిసి తీసుకున్న పలు ఫొటోలను షేర్ చేశారు. తమ స్నేహితులైన విజయ్–రష్మికల వివాహాన్ని ఈ జంట ఎంతో ఆనందంగా జరుపుకుంది. త్వరలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్న ఈ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ క్యూట్ ఫొటోలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బలతో పాటు దర్శకులు సందీప్ రెడ్డి వంగా, శివ నిర్వాణ తదితర సినీ ప్రముఖులు కూడా కనిపిస్తున్నారు. అందరూ కలిసి ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్న ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అయితే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాయి.
