- Advertisement -

కేరళ స్టోరీ 2..విడుదల తర్వాత కూడా కష్టాలే!

- Advertisement -

ది కేరళ స్టోరీ 2 విడుదలకు ముందు విడుదల తర్వాత కూడా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కేరళలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోతోంది. విడుదలకు ముందు వివాదాలు రేకెత్తించిన ఈ చిత్రం, థియేటర్లలో స్పందన లేదు. కేరళ హైకోర్టు మొదట ఈ చిత్ర ప్రదర్శనపై 15 రోజుల స్టే విధించినప్పటికీ, తరువాత డివిజన్ బెంచ్ అనుమతి ఇవ్వడంతో ప్రదర్శనకు మార్గం సుగమమైంది. ఈ న్యాయపరమైన తగాదాలు రాష్ట్రంలో తీవ్ర చర్చలకు దారి తీసినా, ఆ ఉత్కంఠ బాక్సాఫీస్ వద్ద కనిపించలేదు.

కోజికోడ్‌లోని రిగల్ థియేటర్‌లో మొదటి షోకు కేవలం రెండు టికెట్లు మాత్రమే బుక్ కావడంతో ప్రదర్శనను రద్దు చేయాల్సి వచ్చింది. ఎర్నాకులం జిల్లాలో ఏడు థియేటర్లలో చిత్రం ప్రదర్శితమవుతున్నప్పటికీ ఆక్యుపెన్సీ తక్కువగానే ఉంది. పాన్ సినిమాస్‌లో ఒక షోకు ఆరు టికెట్లు మాత్రమే అమ్ముడవగా, పీవీఆర్‌లో రెండు టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. కొచ్చిలోని షెనాయ్స్ థియేటర్‌లో ఉదయం ప్రదర్శనకు కూడా ప్రేక్షకులు తక్కువగానే హాజరయ్యారు.

ఇక విడుదలకు వ్యతిరేకంగా డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు కొచ్చి, త్రిస్సూర్, కన్నూర్ ప్రాంతాల్లో థియేటర్ల ఎదుట నిరసనలు చేపట్టారు. అయితే ఈ ఆందోళనలు శాంతియుతంగానే జరిగాయి. ఎవరైనా సినిమా చూడాలని వస్తే అడ్డుకోం, కానీ ఇప్పటివరకు ఎవరూ రాలేదు అని నిరసనకారులు తెలిపారు.

కేరళను విభజనాత్మకంగా లేదా వక్రీకరించిన రీతిలో చూపించే ప్రయత్నాలను అంగీకరించబోమని సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత, మాజీ మేఘాలయ గవర్నర్ కుంమనం రాజశేఖరన్ మాత్రం ఈ చిత్రాన్ని తప్పక చూస్తానని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -