Tuesday, April 23, 2024
- Advertisement -

వెంకటేష్ కోసం ఆ కథ ని పక్కన పెట్టిన యువ దర్శకుడు

- Advertisement -

పెళ్లి చూపులు సినిమా కి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ లో పాగా వేశారు. ఈ నగరానికి ఏమైంది తర్వాత రానా తో ఒక సినిమా చేస్తాను అని చెప్పిన తరుణ్ ప్రస్తుతం ఏం సినిమా తో మన ముందుకు వస్తాడా అనే ఆసక్తి అందరిలో ఉంది కానీ ఆయన మాత్రం నటుడిగా బిజీ గా ఉన్నాడు. విజయ్ దేవరకొండ నిర్మాణం లో రానున్న మొదటి చిత్రం షూటింగ్ లో బిజీ గ ఉన్నాడు తరుణ్.

ఇకపోతే ఇటీవలే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుండి వచ్చిన సమాచారం ప్రకారం తరుణ్ త్వరలో వెంకటేష్ తో ఒక సినిమా చేయనున్నాడు అని తెలుస్తుంది. అయితే తరుణ్ ముందుగా ఒక రేసు గుర్రానికి సంబందించిన జర్నీ ని సినిమా రూపం లో తెద్దాం అనుకున్నాడట కానీ వెంకటేష్ ఇప్పుడు సినిమా చేయడానికి రెడీ అని చెప్పడం తో ఆ కథ ని పక్కన పెట్టాడట. అయితే ఒక గుర్రం రేసు గుర్రం లాగా ఎలా మార్చబడుతుంది, దాని జీవితం ఎలా ఉంటుంది అనే కథ ని తరుణ్ రాసుకొని వర్క్ చేస్తున్నాడు.

ఇప్పుడు వెంకటేష్ ప్రాజెక్ట్ ముందుకు రావడం తో ఈ కథ కి పాజ్ ఇచ్చాడు. అయితే వెంకటేష్ తో చేయనున్న చిత్రాన్ని 2020 చివరి కల్లా విడుదల చేస్తారు అని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -