Tuesday, April 30, 2024
- Advertisement -

జ‌గ‌న్ కేబినేట్‌లో ఖ‌రారాయిన మంత్రుల లిస్ట్‌…

- Advertisement -

ఏపీ నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేబినెట్ పై కూర్పు దాదాపు పూర్త‌య్యింది. ఇప్ప‌టికే సీఎంవో నుంచి ఫోన్‌లు కూడా వెల్తున్నాయి. రేపు జరుగబోయే వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో కేబినెట్ కూర్పుపై చర్చించి, మంత్రుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. మంత్రి ప‌ద‌వుల ఎవ‌రెవ‌ర‌కి కేటాయించాల్సి వ‌చ్చిందో శాసనసభాపక్ష సమావేశంలో జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌కు వివ‌రించ‌నున్నారు.

సామాజికవర్గాల వారీగా బేరీజులుగా వేసుకుని సమర్థత, విధేయత కలిగిన నాయకులనే మంత్రులుగా జగన్ ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే విద్య‌, వైద్యం ఆరోగ్యం, ఇరిగేష‌న్ శాఖ‌ల‌ను మాత్రం జ‌గ‌నే స్వ‌యంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే జాబితా ఖ‌రార‌యిన‌ట్లు స‌మాచారం.

మంత్రుల లిస్ట్ చూసుకుంటె… విజ‌య‌న‌గరం నుంచి బొత్స‌స‌త్య‌నారాయణ‌, పుస్ప‌శ్రీవాణి , విశాఖ‌నుంచి విశాఖ‌నుంచి అవంతి శ్రీనివాస్‌కు కేబినేట్ ద‌క్కే అవ‌కాశం క‌నిపిస్తోంది. తూర్పుగోదావ‌రి నుంచి పిల్లి సుబాష్ చంద్ర‌బోష్, దాడిశెట్టి రాజాల‌కు అవ‌కాశం ద‌క్క‌నుండ‌గా ప‌శ్చిమ గోదావ‌రి నుంచి ముడ‌నూరి ప్ర‌సాద‌రాజుల‌కు కేబినేట్ బెర్త్ ఖాయంగా క‌నిపిస్తోంది.

కృష్ణాజిల్లానుంచి కొడాలి నానికి అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. గుంటూరునుంచి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, సుచ‌రిత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాద‌వ్‌, మేక‌పాటి గౌత‌మ్ రెడ్డిల‌కు జ‌గ‌న్ టీమ్‌లో స్థానం ద‌క్కిన‌ట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ప్ర‌కాశంనుంచి బాలినేని శ్రీనివాసుల‌రెడ్డిల‌కు కేబినేట్‌లో స్థానం ఖాయంగా క‌నిపిస్తోంది. కర్నూలు నుంచి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, క‌డ‌ప‌నుంచి అంజ‌ద్ బాషా, కొర‌ముట్ల శ్రీనివాసుల‌కు కేబినేట్‌లో స్థానం ద‌క్కునున్నాయి. అనంత‌పురం నుంచి అనంత వెంక‌ట్రామిరెడ్డికి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్లు తెలుస్తోంది.

డిప్యూటీ స్పీకర్‌గా మహిళా ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే చిత్తూరు నుండి రోజాకు మంత్రిగా ఛాన్స్ ఉందా లేదా అని రేపు తెలుస్తోంది. అంబటి రాంబాబు పేరు కూడా లిస్ట్‌లో కనిపించడం లేదు కాబట్టి..అంబటికి స్పీకర్‌గా అవకాశం ఉంటుందో లేదో చూడాలి. అయితే రేపు జ‌గ‌న్ ప్ర‌టించే లిస్ట్‌లో ఎంత‌మందికి చోటు ద‌క్క‌తుంద‌నేది తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -