వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వస్తున్న చిత్రం భైరవగీత.రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాతో సిద్ధార్థ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ధనుంజయ,ఇర్రా మోర్ ఈ సినిమాలో హీరో,హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్‌కు విపరీతమైన స్పందన వస్తుంది.తాజాగా ఈ సినిమా గురించి హీరోయిన్ ఇర్రా మోర్ మాట్లాడింది.మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ఇర్రా మోర్.ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలు గురించి అడగ్గా…తప్పనిసరి పరిస్థితుల్లోబలవంతగా అలా నటించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది.
‘ఈ సినిమాలో ఇద్దరి ప్రేమికుల మధ్య ప్రేమను తెలియజేసేందుకు లిప్ లాక్ సీన్లు తప్పవు. వందలాది మంది మధ్యలో అలా నటించడం నాకు అసలు నచ్చలేదు. కానీ హీరోయిన్ గా అది నా బాధ్యత అని భావించి అలాంటి సన్నివేశాల్లో నటించాను” అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమా తరువాత తనకు అవకాశాలు వస్తాయని భావిస్తుంది ఇర్రా మోర్.ఇక ఈ సినిమాను నవంబర్ 30న విడుదల చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=BB-rLE0Pu-s