Thursday, May 2, 2024
- Advertisement -

డియర్ కామ్రేడ్: విజయ్ సంతోషానికి కారణం అదే

- Advertisement -

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో అగ్రగామి నటుల్లో ఒకరు. ఇటీవలే ఆయన చేసిన డియర్ కామ్రేడ్ అనే సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా కి మొదటి రోజే డివైడ్ టాక్ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఆ విషయం పక్కన పెడితే సోమవారం నుండి సినిమా వసూళ్ళలో చాల వరకు నష్టాలూ వచ్చే సూచనలు కనిపించాయి. ఊహించని విధం గా సినిమా వసూళ్లు పడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ విషయం మీద విజయ్ పెద్దగా పట్టనట్టు ఉన్నాడు. సినిమా విడుదల అయ్యాక ఒక ప్రెస్ మీట్ కి కి వచ్చాడు కానీ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా అస్సలు ప్రమోషన్స్ చేయడమే మానేసాడు. అయితే ఇండస్ట్రీ టాక్ ప్రకారం విజయ్ దేవరకొండ కి ఈ సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా పెద్దగా ప్రభావం ఏమి లేదట. ఎందుకంటే ఆల్రెడీ విజయ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అన్నీ మొదలైపోయాయి కూడా.

ఇది పక్కన పెడితే సైలెంట్ గా డియర్ కామ్రేడ్ ముందు విజయ్ పారితోషికం పెంచేసాడట. ఈ సినిమా కోసం విజయ్ దాదాపు గా పది కోట్లు అందుకున్నట్టు సమాచారం. అందుకే విజయ్ డియర్ కామ్రేడ్ విడుదల తర్వాత సైలెంట్ అయిపోయాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -