Monday, May 13, 2024
- Advertisement -

జగన్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఖరారు….

- Advertisement -

ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైఎస్ జగన్ పాలనలో తనదైన శైలిలో ముందుకు వెల్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైన నవరత్నాల పథకాలను అమలు చేసెందుకు పూనుకున్నారు. ఆర్థిక లోటు ఉన్నా బడ్జెట్ లో నవరత్నాల పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. ఇదలా ఉంటె తాజాగా జగన్ ఢిల్లీ పర్యటన ఖరారయ్యింది.

ఇవాళ రాత్రికి లోటస్ పాండ్ నివాసంలోనే జగన్ బస చేసి… గురువారం సాయంత్రం హైదరాబాద్ నివాసం నుంచి జెరూసలేం పర్యటనకు బయల్దేరి వెళ్తారు. తిరిగి ఐదో తేదీ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. జగన్ జెరూసలేం పర్యటన నేపథ్యంలో్ అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇవాళ మధ్యహ్నం హైదరాబాద్ కు వచ్చిన తర్వాత శంషాబాద్ మండలంలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి కూడా జగన్ వెళ్లనున్నారు. అక్కడ సీఎం స్వామివారి ఆశీస్సులు తీసుకోనున్నారు.

అనంతరం ఆగస్టు 6,7 తేదీల్లో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ తో సమావేశం కానున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ దృష్టికి రాష్ట్ర సమస్యలు, పెండింగ్ లో ఉన్న అంశాలను వివరించనున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ఉదారంగా ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు ప్రాజెక్టుల విషయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతోపాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోం శాఖ మంత్రి అమిత్ షాలను కూడా జగన్ కలవనున్నారు. శాసనసభ ఫలితాలు వెలువడిన తర్వాత మే 26న, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జూన్ 19న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్.. కేవలం కొన్ని గంటలు మాత్రమే అక్కడే సమయం గడిపిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -