Saturday, April 20, 2024
- Advertisement -

ఆమె హీరోలందరికీ పడిపోయిందట..నాగార్జునతో కొంచెం ఎక్కువగా!

- Advertisement -

ప్రేమ అనడానికి లేదు కానీ.. తను తనతో పనిచేసిన హీరోలందరికీ పడిపోయాను అంటోంది శ్రియ. అది ఆకర్షణ మాత్రమేనని కూడా ఆమె నే చెప్పుకొంటూ వస్తోంది .ఇండస్ట్రీలో పదేళ్లకు పైగా గడిపిన శ్రియ కెరీర్ ఇప్పుడు దాదాపుఅంతానికి వచ్చిందనే అభిప్రాయాలు వస్తున్నాయి.

హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయి.. తల్లి పాత్రలు దక్కుతున్నాయి ఆమెకు. మధ్యతరగతి గృహిణి పాత్రలు వేసుకొంటోంది. ఇలాంటి నేపథ్యంలో శ్రియ తన ఇండస్ట్రీలో తనకున్న అనుభవాలను ప్రస్తావించింది.

తన కెరీర్ లో కలిసి పనిచేసిన అనేక మంది హీరోల ఆకర్షణకు తను లోనయ్యానని శ్రియ వివరించింది. అయితే దాన్ని ప్రేమ అనలేమని ఆమె చెప్పింది. వారి ఆకర్షణకు లను లోనయ్యాయనని వివరించింది. అయితే ఇలా పడిపోవడంలో కూడా నాగార్జున కు కొంచెం ఎక్కువగా పడిపోయానని ఆమె చెప్పడం విశేషం. నాగార్జున తనకు సన్నిహితుడు అని .. ఆయన తనకు ఆది నుంచి అండగా ఉన్న వ్యక్తి అని ఆమె చెప్పుకొచ్చింది. ఏ రోజు అయినా నాగ్ ఇంటి తలుపులు తనకోసం తెరిచి ఉంటాయని చెప్పింది.

అలాగే నాగార్జునతోనే కాకుండా ఆయన తనయులిద్దరితోనూ తనకు సాన్నిహిత్యం ఉందని శ్రియ వివరించింది. నాగార్జున భార్య అమల తనకు సన్నిహితురాలు అని చెప్పుకొచ్చింది. అయితే తను ఎవరితోనూ డేటింగ్ చేయలేదని శ్రియ చెప్పడం విశేషం. అయితే తనపై లేని పోని పుకార్లను సృష్టించారని ఆమె ఆరోపిస్తోంది. తను ఇప్పటికీ సింగిలేనని స్పష్టం చేసింది. 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -