Thursday, May 16, 2024
- Advertisement -

కాజల్ వ‌స్తోంది…వెళ్తోంది… ఏంటి సంగ‌తి..?

- Advertisement -

క్యూట్ కాజల్ మ్యాటర్లో ఓ గమ్మత్తైన విషయం జరుగుతుంది. ఒక్క హిట్ వచ్చిందో లేదో అమ్మడు ఆ ఉడ్ నుంచి జెండా ఎత్తేసి….మరొక చోటకు వెళ్లిపోతోంది. అక్కడ కూడా ఒక్క హిట్ పడిన వెంటనే తిరుగు టపా కట్టేస్తోంది. మళ్లీ ఇక్కడ హిట్ కొట్టేస్తోంది.

గత కొంతకాలంగా నడుస్తోన్న కాజల్ ట్రాక్ చూస్తే ఎవ్వరైనా ఇది ఒప్పుకోక తప్పదు. క్యూట్ కాజల్ తాను చేసిన ప్రతి చిత్రం తర్వాత ఏదో ఒకరకంగా ఆ పరిశ్రమకు దూరమైపోతోంది. మళ్లీ వస్తోంది. మరో హిట్ ఇస్తోంది. మళ్లీ సేమ్ టు సేమ్ సీన్. టాలీవుడ్లో హిట్ కొట్టాక కోలీవుడ్ ఫిలింకు ముహూర్తం పెడుతోంది. కోలీవుడ్లో హిట్ కొట్టాక టాలీవుడ్లో ముహూర్తం షూట్ కు అటెండ్ అవుతోంది. అందమున్న ముద్దుగుమ్మ ఏం చేసినా నడుస్తోందనే మాట కాజల్ విషయంలో ఇప్పుడు నూటికి నూరుపాళ్లు నిజమైంది.

వివ‌రాలు కావాలంటే… ఈస్టోరీకి ఎంట‌ర‌వ్వాల్సిందే…..

క్యూట్ గాళ్ ట్రాక్ ను ఒకసారి పరిశీలిస్తే…అమ్మడు వెళ్తోంది వస్తోంది అనే మాట ఎంత వాస్తవమో తెలుస్తోంది. బిజినెస్ మేన్ హిట్ తర్వాత కాజల్ తెలుగులో వరుస చిత్రాలతో బిజీ అయిపోవాలి. కాని అలా జరగలేదు. కావాలని చెప్పి మరీ…. విజయ్ తో తుపాకీని,సూర్యతో మాట్రన్ చేసింది. ఈ రెండు సినిమాల్లో తుపాకీ బ్లాక్ బస్టర్ గా నిలిచి అరవంలో అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఆతర్వాత తెలుగు పరిశ్రమకు వచ్చి బాద్ షా చేసింది. వెను వెంటనే విజయ్ తో మళ్లీ కమిటై జిల్లా చేసిపెట్టింది. అది చేసిందో లేదో టెంపర్ తో తారక్ ను మరోసారి డిస్ట్ర్రబ్ చేసింది. ఆయనగారు టాలీవుడ్లో ఏం చేస్తావులే అని చెప్పి ధనుష్ తో ‘మారి’ చేసుకోమని మరీ మరీ చెప్పాడు. కట్ చేస్తే ‘మారి’ అయింది.

పాయం పులితో కోలీవుడ్లో మళ్లీ బిజీఅయిపోయింది.

క్యూట్ కాజల్ ను లేటెస్ట్‌ గా బ్రహ్మోత్సవం సినిమాకు కూడా తీసుకున్నారు. అయితే ఆ సినిమా షూట్ వాయిదా వేసుకోవడంతో మళ్లీ చెన్నై చెక్కేసి చియాన్ విక్రమ్ తో మర్మ మనితన్ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. ఈ ఫిలిం ప్రీ ప్రొడక్షన్ లో ఉండడంతో టైమ్ ఉంది కదా అని తాజాగా పవన్ సర్దార్ కు ఓకే చెప్పింది. అంటే ఒక చోట హిట్ కొట్టాక కనీసం వరుసగా మరో సినిమా చేయని కాజల్ అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో ప్యారలల్ గా సినిమాలు చేస్తూ వస్తోంది. బహుశ ఈ రీతిలో రెండు పడవల ప్రయాణం చేస్తూ….. సక్సెసైన మరో భామ సౌత్లో లేదనేది సినీ వ‌ర్గాల వాదన. అందుకే వెళ్లోంది-వస్తోంది అనే మాట కాజల్ కు కరెక్ట్ గా సెట్ అవుతుంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -