Tuesday, May 21, 2024
- Advertisement -

ట్వీట్ చేస్తే ఈయ‌న‌కు 7 కోట్లు!

- Advertisement -

హాలీవుడ్‌ నటుడు రాక్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.ఈయ‌న అస‌లు పేరు డ్వెయిన్‌ జాన్సన్‌.హాలీవుడ్‌లో మ‌నోడి క్రేజ్ మాములుగా ఉండ‌దు.దానికి త‌గినట్లుగానే రాక్ పారితోష‌కం కూడా ఉంటుంది.ఆయన నటించే సినిమాలను ఆయ‌నే ప్ర‌మోష‌న్స్ చేయ‌డానికి తీసుకునే పారితోష‌కం ఎంతో తెలుసా!అక్ష‌రాల 7 కోట్లు.మ‌న తెలుగులో మీడియం హీరోలు ఓ సినిమాకు తీసుకునే పారితోష‌కం రాక్‌కు జ‌స్ట్ సినిమా ప్ర‌మోష‌న్ చేస్తే వ‌స్తుంది.ప్రస్తుతం డ్వెయిన్‌ ‘రెడ్‌ నోటిస్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దాంతో ఈ సినిమాకు సంబంధించి సోషల్‌మీడియాలో పెట్టే ఒక్కో పోస్ట్‌కి రాక్‌ రూ.7 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు.రాక్ ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచంలో పేరుమోసిన సూపర్‌స్టార్లలో రాక్ ఒకరు. అంతటి గొప్పస్టార్‌తో నటించే అవకాశం మన భారతీయ నటి ప్రియాంక చోప్రాకు దక్కింది. ప్రియాంక నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రం ‘బేవాచ్‌’లో డ్వెయిన్‌ ప్రధాన పాత్రలో నటించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -