Friday, May 17, 2024
- Advertisement -

ఎవరూ ఊహించని జానర్‌లో మ‌హేష్-సుక్కు సినిమా

- Advertisement -

రంగ‌స్థ‌లం సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న సుకుమార్ త‌న త‌రువాత సినిమాపై ఫోక‌స్ పెట్టాడు.మ‌హేష్ బాబుతో త‌న నెస్ట్ సినిమా అనౌన్స్ చేసిన సుక్కు ఆ సినిమా స్టోరీకి మెరుగులు దిద్దుతున్నాడు.ప్రస్తుతం తన సొంతూరులో ఉన్న సుకుమార్ త్వరలోనే మహేష్ సినిమా కోసం కథను సిద్ధం చేయబోతున్నాడు. గ‌తంలో మ‌హేష్ బాబుతో 1 నేనొక్కడినే సినిమా తీశాడు సుకుమార్‌. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ అయిప్ప‌టికి ఇందులో మ‌హేష్ న‌ట‌న‌కు ద‌ర్శ‌కుడిగా సుకుమార్‌కు మంచి పేరు వ‌చ్చింది.

రంగ‌స్థ‌లం సినిమా స‌క్సెస్ మీట్ కూడా 1 నేనొక్కడినే సినిమా గురించి మాట్లాడిన సుకుమార్ ఓ మంచి సినిమాను కిల్ చేశాన‌ని భాద‌ప‌డ్డారు.ఈసారి మ‌హేష్‌కి హిట్ ఇవ్వ‌ల‌ని క‌సితో ఉన్నాడు సుకుమార్‌.నిజానికి సుకుమార్.. మహేష్ కు ఒక లైన్ మాత్రమే చెప్పారట. అది ఆసక్తికరంగా అనిపించడంతో ఆయన పూర్తి కథను సిద్ధం చేయమని చెప్పారట.మ‌హేష్ ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఈ సినిమా త‌రువాత సుకుమార్ సినిమా ఉంటుంది. ఈ సినిమా దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -