Wednesday, May 15, 2024
- Advertisement -

మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. థ్యాంక్స్ మీడియా

- Advertisement -

భిన్న త‌ర‌హా సినిమాల‌తో వ‌చ్చి హిట్లు పొందుతున్న కుర్ర న‌టుడు నిఖిల్ ‌. అయితే పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చే వ‌ర‌కు భిన్నంగా స్పందించాడు. ఇటీవ‌ల ప్ర‌త్యేక హోదాపై గ‌ళం విప్పి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. ఇప్పుడు ప్ర‌స్తుతం నిఖిల్ క‌న్న‌డ సినిమా కిరాక్ పార్టీ రీమేక్‌ను తెలుగులో తీస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్త‌యి ప్ర‌స్తుతం వేస‌విలో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఇటీవ‌ల ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో పాటు సినిమా వివ‌రాలు పంచుకున్నాడు. ఈ స‌మ‌యంలోనే పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. దీనికి భిన్నంగా స్పందించాడు.

నిఖిల్‌కు గ‌తంలో తేజ‌స్విని అనే అమ్మాయితో నిశ్చితార్థం అయ్యి పెళ్లి దాకా వెళ్లి ఆగిపోయింద‌ని ప్ర‌చారం జ‌ర‌గ్గా అది ఉత్తిమాటే అని కొట్టిపారేశాడు. అయితే పెళ్లి విష‌య‌మై తనకు ఇప్ప‌టివ‌ర‌కే మూడుసార్లు పెళ్లి అయ్యింద‌ని చెప్పాడు. దీనికి అంద‌రూ షాక్ కాగా దానికి వివ‌ర‌ణ ఇచ్చాడు. ఆ పెళ్లిళ్లు చేసిందంతా మీడియాకే దక్కుతుందని మీకు థాంక్స్ అంటూ కౌంటర్ వేశాడు. నిఖిల్ ఎలా పెళ్లిళ్లు అయ్యాయ్యో చూద్దాం. సినిమాల్లో ఈపాటికే నిఖిల్‌కు చాలాసార్లు పెళ్లిళ్లు చేశారు.

ఆ త‌ర్వాత కూడా ఏడాదికోసారి నిఖిల్‌కు ఆమెతో పెళ్ల‌య్యింది.. ఈమెతో లింక్ ఉంద‌ని ప్ర‌చారాలు చేశారు. వాటిలో నిఖిల్ మూడు గుర్తు పెట్టుకొని ఈ విధంగా మీడియాపై వ్యంగ్యంగా విమ‌ర్శించాడు. ఇటీవ‌ల నిఖిల్‌కు ప‌రిణ‌తి వ‌చ్చి ప‌ద్ధ‌తిగా న‌డుచుకుంటూ వెళ్తున్నాడు. మంచి మంచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ వెళ్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -