Monday, May 13, 2024
- Advertisement -

క‌మ‌ల్‌హాస‌న్‌కు మాజీభార్య‌తో మ‌రో త‌ల‌నొప్పి

- Advertisement -

విడిపోయినా బకాయిలు చెల్లించాల్సిందే.. గౌత‌మి ఆల్టిమేటం

13 ఏళ్ల సహ జీవన బంధాన్ని గ‌తేడాది కమల్ హాసన్‌తో ఒక‌ప్ప‌టి హీరోయిన్ గౌతమి తెగదెంపులు చేసుకుని త‌న దారి తాను చూసుకుంది. అయితే కమల్, గౌత‌మి విడిపోవ‌డంపై ప‌లు పుకార్లు వ‌చ్చాయి. వాట‌న్నిటిని కొట్టి పారేసిన గౌత‌మి ఇప్పుడు క‌మ‌ల్‌హాస‌న్‌కు కొత్త త‌ల‌నొప్పి తెచ్చి పెడుతోంది. క‌మ‌ల్‌తో జీవించినంత కాలం క‌మ‌ల్ సినిమాల‌కు ఏదో విధంగా స‌హ‌కారం అందించింది. క‌మ‌ల్ సినిమాల్లో ఆమె పాత్ర కూడా మ‌రువ‌లేనిది.

ఏళ్లుగా కమల్‌తో పాటు ప్రయాణం చేసిన గౌతమి ఆ స‌మ‌యంలో క‌మ‌ల్ ప్రతి సినిమాకు పని చేశారు. దాని గురించి ప్రస్తావిస్తూ దశావతరం స‌మ‌యం నుంచి కమల్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ నుంచి తనకు జీతం ఇవ్వలేదని ఆమె బాధ వ్య‌క్తం చేస్తోంది. ఆ బకాయిలు మొత్తం అలాగే పెండింగ్ ఉంచారని క‌మ‌ల్‌కు షాక్ ఇచ్చారు. రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన క‌మ‌ల్‌కు గౌతమితో కొత్త క‌ష్టాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. మార్పు కోసం మంచి కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని చెబుతున్న కమల్ తన వ్యక్తిగత జీవితంలోని వారే ఇలా వివాదం చేయడం ఇర‌కాటంలో ప‌డేసే విష‌యం ఇది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -