Tuesday, May 21, 2024
- Advertisement -

చిరు తర్వాతి చిత్రమేంటో తెలిసిపోయింది

- Advertisement -

బ్రూస్ లీ ఆడియో లాంచ్ ను సరిగా చూసినవారికి చిరంజీవి తర్వాత చిత్రమేమిటి..?

అతని సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు..? ఆ చిత్రం ఏతరహా సినిమా అనే విశేషాలు తెలిసిపోయే ఉంటాయి. ఇప్పటి వరకూ మనకున్న టాక్ …మురుగదాస్ తీసిన కత్తి సినిమాను టాలీవుడ్లో చిరు తీస్తాడని. ఈ ఆడియో లాంచ్ చూసాక వినాయక్ ఇచ్చిన హింట్ బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. 

డైరెక్టర్ వినాయక్ చిరును చూద్దామని చెప్పి బ్రూస్ లీ సెట్ కు వెళ్లాడట. అప్పుడు అన్నయ్య ఎలా ఉన్నారని అంటే కత్తిలా ఉన్నానని చిరు చెప్పాడట. వినాయక్ చెప్పింది ఇదే అయినా…కత్తి అనే పదాన్ని  కావాలని ఒత్తి పలకడంతో… కత్తి సినిమా  వీరిద్దరి కాంబినేషన్లోనే  రీమేక్ అవుతుందా అనే సందేహం చాలామందికి వచ్చింది. దానికి బలాన్ని చేకూర్చుతూ చిరు సైతం ముసి ముసి నవ్వులు నవ్వడం చూస్తే…ఇక అదే చిరు చిత్రమని ఫ్యాన్స్ ,పరిశ్రమ ఒక అభిప్రాయానికి వచ్చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -