Monday, April 29, 2024
- Advertisement -

మెగాఫ్యామిలీపై ఆ దర్శకుడు కత్తి గట్టాడా…?!

- Advertisement -

ఒకటి కాదు రెండు కాదు… ఈ మధ్యకాలంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి మెగా ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకొని ఒక్కొక్క బాణం పడుతోంది. అవకాశం ఉన్న ప్రతి సారీ మెగా ఫ్యామిలీపై ఏదో ఒక వివాదాస్పద రీతిలో విరుచుకుపడుతున్నాడు వర్మ.

ఇది వరకూ ఎప్పుడో పవన్ ను ఆకాశానికెత్తేసిన వర్మ ఆ తర్వాత ఒక దశను పవన్ ను ప్రశంసించాడు. మళ్లీ “ఇజమ్” బుక్ విషయంలో మాత్రం వర్మ పవన్ ను విమర్శించాడు. కానీ.. ఇప్పుడు మాత్రం మళ్లీ వరసగా వర్మ విరుచుకుపడుతున్నాడు. 

ట్విటర్ లో పవన్ కు ఫాలోయర్ల సంఖ్య విషయంలో వర్మ  వివాదాస్పద ట్వీట్ పెట్టాడు. ట్విటర్ లో మహేశ్ బాబుకు ఎక్కువమంది ఫాలోయర్లు ఉన్నారని.. మహేశ్ బాబు కన్నా పవన్ కు చాలా తక్కువమంది ఫాలోయర్లు ఉన్నారని.. ఇది పవన్ అభిమానులను నిరాశ పరిచే అంశమని వర్మ అభిప్రాయపడ్డాడు. వర్మ చెప్పింది నిజమే అయినా… పవన్ అభిమానులను మాత్రం వర్మ ఆ విధంగా నిరాశ పరిచాడు. వారు వర్మపై విరుచుకుపడ్డారు.

అంతే కాదు ఇప్పుడు వర్మ మరో వివాదాన్ని రేపాడు. ఒకవైపు మెగా పవర్ స్టార్ హీరోగా ‘బ్రూస్ లీ’ సినిమా రూపొందుతున్న సమయంలో వర్మ ‘బ్రూస్ లీ’ అంటూ మరో సినిమాను తెరపైకి తెచ్చాడు. ఒకవైపు చరణ్ సినిమా ప్రచారంలోకి వచ్చినా వర్మ మళ్లీ అదే పేరుతో రూపొందిచడం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే.. మెగా ఫ్యామిలీని వర్మ వరసగా టార్గెట్ చేస్తున్నట్టవుతోంది! మరి ఎందుకిలా చేస్తున్నాడనేదే అర్థం కాని విషయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -