ఈ దసరాకు ముగ్గురు తమ అదృష్టం పరీక్షించుకుందామని వస్తున్నారు.వారిలో ముందుగా హైలెట్ అయినవాడు మన మెగా వారసుడు వరుణ్ తేజ్ .అది కూడా క్రిష్ లాంటి దర్శకుడి నుంచి వస్తోన్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ద సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందించారు.
అలాగే వరుణ్ కు పోటీగా సుమంత్ అశ్విన్ కొలంబస్ గా వస్తున్నాడు.అంతకుముందు ఆతరువాత,లవ్ లీ ,కేరింత లాంటి హిట్ల తర్వాత వస్తోన్న వెంచర్ కావడంతో సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.ఇక ఈ రేస్ లో మూడవ ప్లేస్ లో ఉన్నవాడు మన ఓం కారన్నయ్య.ఆయనగారు రాజుగారి గదిలో ఏముందో చూపిస్తానంటూ భయపెడుతున్నాడు.సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్ తో తయారైంది కాబట్టి ఈసారి తనకు హిట్ గ్యారంటీ అంటున్నాడు.
ముగ్గురుకి ఇపుడున్న టైమ్లో హిట్ ఖచ్చితంగా కావాలి. బ్రూస్ లీ ఫ్లాప్ కావడంతో థియేటర్ల ప్రాబ్లమ్ కూడా పెద్దగా ఏం లేదు కాబట్టి…వీరి ముగ్గురిలో ఎవరు ఎన్ని థియేటర్లు పంచుకుని అధ్బుతాలు సృష్టిస్తారో చూడాలి.ఎవరైతే విజేతగా నిలుస్తారో వారి మీద మీడియా ఫోకస్ కూడా ఎక్కువగా ఉండే స్కోప్ ఉంది కాబట్టి…వారి స్థాయికూడా పెరగొచ్చు. మరి దసరా బుల్లోడు ఎవరవుతార.