Monday, April 29, 2024
- Advertisement -

బాబోయ్ దసరా కి మా సినిమాలను రిలీజ్ చేయం..?

- Advertisement -

కరోనా కారణంగా ఇన్నాళ్లు మూతబడిపోయిన థియేటర్లు ఈనెల 15 నుంచి ఓపెన్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే.. దీంతో సినిమా ప్రేక్షకులు ఎన్నాళ్లకు థియేటర్లో సినిమా చూసే అవకాశం వచ్చింది అని తెగ సంబరపడిపోతున్నారు.. అయితే వారి సంతోషం ఎంతో సేపు లేదు.. థియేటర్లు అయితే ఓపెన్ అయ్యాయి కానీ సినిమా హలో సినిమా ను రిలీజ్ చేసే ధైర్యం ఏ నిర్మాత చేస్తాడు అన్నది సందేహంగా వుంది.. ఇప్పటికే పలు కీలకమైన, కఠినమైన ఆంక్షలమధ్య సినిమా థియేటర్లను ఓపెన్ చేస్తున్నారు.. సగానికి తక్కువే జనాలు ఉండాలంటున్నారు.. అలాంటి సమయంలో సినిమా బాగుంటేనే థియేటర్లకు వచ్చే జనాలు ఈ టైం లో అసలు బాగున్నా సినిమా కైనా వస్తారా అన్నది డౌట్ గా వుంది..

ఇక దసరా సీజన్ అంటే సినీ ప్రేక్షకులకు పండగ.. పెద్ద హీరోలందరూ ఈ సీజన్ లో తమ సినిమాలు రిలీజ్ చేయాలనీ ఆశగా ఉంటారు.. కానీ ఈ దసరా కి సినిమా ని రిలీజ్ చేయాలంటే తెగ భయపడిపోతున్నారట. అందుకు కారణం సినిమా హాల్స్ కి ఎంతమంది వస్తారో అన్నది తెలియకపోవడమెనట.. ఏడు నెలలు మూత పడి ఉన్న థియేటర్లను దసరాకు పది రోజుల ముందు, అంటే అక్టోబరు 15న పున:ప్రారంభించబోతున్నారు. కానీ వెంటనే కొత్త సినిమాలు ఏవీ రిలీజయ్యే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. దసరా సీజన్లో రిలీజ్ కోసం సినిమాలు పోటీ పడే అవకాశమే లేదు.

థియేటర్లు తెరుస్తున్నాం.. ఎన్ని కావాంటే అన్నిస్తాం కొత్త సినిమాలు రిలీజ్ చేయండి మహాప్రభో అని ఎగ్జిబిటర్లు అడుగుతున్నా విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు.  ఓవైపు నిర్మాతలు ముందైతే థియేటర్లు తెరవడానికి అనుమతి ఇచ్చారు కాబట్టి రెండు మూడు వారాల తర్వాత ఫుల్ ఆక్యుపెన్సీ కోసం ప్రభుత్వాలకు సినీ పరిశ్రమ నుంచి విజ్ఞప్తులు వెళ్తాయని భావిస్తున్నారు. మిగతా అన్ని చోట్లకూ జనాలను మామూలుగానే అనుమతిస్తూ.. థియేటర్ల విషయంలో వివక్ష ఏంటంటూ తమ గోడు వెల్లబోసుకుని, కొంచెం గట్టిగా ఒత్తిడి చేసి మునుపట్లా థియేటర్లు నడిచేలా చేసుకోవాలని సినీ పెద్దలు యోచిస్తున్నారు.  ఇది జరిగే సరికి దీపావళి వస్తుంది అప్పుడు తమ సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చని భావిస్తున్నారట నిర్మాతలు..

హిట్ డైరెక్టర్ కి హీరో లేడేంటి.. ఆయనకు ఏంటి దుస్థితి..?

రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీరే..!

నితిన్, ప్రభాస్ లకు ఉన్నంత గట్స్ ఎవరికీ లేకపాయె..?

ఉప్పెన, రెడ్ సినిమా లు ఇంతలా భయపడుతున్నాయేంటి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -