Sunday, May 5, 2024
- Advertisement -

క‌త్తిలా మారిన‌ క‌త్రినా

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ రూటే స‌ప‌రేటు.క‌త్రాన పని అయిపోయింద‌న్న ప్ర‌తిసారి త‌నేంటో నిరుపించ‌కుంటునే ఉంది.ఈ మధ్య క‌త్రినా న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టాయి.దీంతో రేస్‌లో బాగా వెన‌క‌ప‌డింది క‌త్రినా.టైగ‌ర్ జింద హై త‌రువాత ఆమె న‌టించిన సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు.తాజాగా ఆమె న‌టిస్తున్న‌ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లోని ఆమె ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ఆ లుక్‌లో క‌త్రినాని చూసిన ప్ర‌తి ఒక్క‌రు క‌త్తిలా ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో అమీర్ ఖాన్‌,అమితాబ్‌,వంటి బ‌డా స్టార్స్ న‌టిస్తున‌ప్ప‌టికి క‌త్రినా క్యారెక్ట‌ర్ సినిమాలో కీల‌కంగా ఉండ‌నుంద‌ట‌.ఈ సినిమాలో కత్రినా బందిపోటుగా క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుంది.సినిమాలోని క‌త్రినా లుక్‌ని అమీర్ ఖాన్ త‌న ట్వీట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. “సురయ్యా జాన్.. అందరికంటే అందమైన బందిపోటు. ‘ధూమ్-3’ సమయంలోనే నేను ఈమె పై నా మనసు పారేసుకున్నా.. కానీ చెప్పడానికి ధైర్యం చాలలేదు. ఎవరైనా ఈ విషయం ఆమెకు చెప్తే నామీద దయచూపిన వారవుతారు.” అంటూ ట్వీట్ లో చమత్కరించాడు అమీర్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -