Sunday, April 28, 2024
- Advertisement -

టైగర్ ఎఫెక్ట్..తప్పు సరిదిద్దుకున్న రవితేజ!

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ హీరోగా దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. సినిమాకు పాజిటివ్ టాక్‌ వచ్చినా విజయ్ లియో, బాలకృష్ణ భగవంత్ కేసరి ముందు వసూళ్లపరంగా వెనుకబడిందనే చెప్పాలి. ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ రావడంతో బాక్సాఫీస్‌ను పోటాపోటీగా షేక్ చేశాయి. దీంతో సినిమా బాగున్నా కలెక్షన్స్ రాబట్టడంలో రవితేజ వెనుకబడ్డాడు.

అందుకే మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నారు రవితేజ. ప్రస్తుతం రవితేజ నటించిన ఈగల్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పొంగల్ రేసు నుండి తప్పుకున్నారట రవితేజ. ఎందుకంటే సంక్రాంతికి అగ్రహీరోల సినిమాలు రిలీజ్ అవడమే కారణమంట.

టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేయాలని భావిస్తున్నారట. మరి రవితేజ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -