Sunday, May 5, 2024
- Advertisement -

మహేష్ ఖలేజా లాగే నాని గ్యాంగ్ లీడర్

- Advertisement -

నాని మరియు విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో గ్యాంగ్ లీడర్ అనే సినిమా ని చాల రోజుల ముందే ప్రకటించారు మైత్రి మూవీ మేకర్స్. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే నిర్మాతల దగ్గర ఈ సినిమా కి సంబందించిన టైటిల్ హక్కులు లేవు. గ్యాంగ్ లీడర్ అనే సినిమా టైటిల్ ని వేరొక నిర్మాత రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ మధ్య ఇదే విషయం పై పలు వివాదాలు కూడా జరిగాయి. టైటిల్ ఇవ్వమని అడిగితే, ఇవ్వనని అవతల పార్టీ వాళ్ళు గొడవ కూడా చేశారు. అయితే ఈ మధ్య మళ్ళీ మైత్రి వాళ్ళు చర్చలు చేయగా,వాళ్ళు టైటిల్ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారట.

అందుకే తెలివిగా మైత్రి వాళ్ళు ఇప్పటికే నాని’స్ గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. ఒకప్పుడు మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా విషయం లో కూడా ఇదే జరిగింది. అప్పుడు దర్శక నిర్మాతలు మహేష్ ఖలేజా అని చెప్పి సినిమా ని విడుదల చేశారు. ఇప్పుడు కూడా అదే కోవలో, నాని గ్యాంగ్ లీడర్ అని చెప్పి ఈ సినిమా ని విడుదల చేయాలని అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇక పై వచ్చే పోస్టర్స్ అన్నిటికీ ఈ కొత్త టైటిల్ ఉండబోతుందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -