Sunday, May 5, 2024
- Advertisement -

ప్రభాస్ సినిమా అంటే ఎందుకింత నెగటివిటీ

- Advertisement -

ప్రభాస్ హీరో గా సుజీత్ దర్శకత్వం లో త్వరలో రానున్న చిత్రం సాహో. ఈ సినిమా ఈ నెల 15 న విడుదల కావాల్సి ఉంది కానీ అనూహ్యం గా ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. 30 వ తారీఖున ఈ సినిమా విడుదల ని ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. అయితే ఆసక్తికర విషయం ఏంటి అంటే ఎప్పుడు లేని విధం గా సాహో సినిమా పై అనవసరమైన నెగటివిటీ ని స్ప్రెడ్ చేస్తున్నారు కొందరు.

ఎందుకో ఏమో తెలియదు కానీ ప్రభాస్ సినిమా మీద ఈ అనవసరమైన నెగటివిటీ వల్ల నిజంగా ఎవరికీ ఉపయోగం లేదు. ప్రభాస్ స్థాయి మన తెలుగు హీరోలని ఎప్పుడో దాటేసింది. అయినా కానీ ప్రభాస్ ఒక పీ ఆర్ టీమ్ ని పెట్టుకొని ఆ విషయం గురించి గొప్పగా చెప్పుకోవడం లేదు. అలాగే క్రేజ్, స్టార్డం వచ్చింది కదా అని కొత్త కొత్త బిజినెస్ పెట్టడం లేదు. నిజానికి అభిమానుల కి కావాల్సిన సినిమా ఇవ్వడం కోసం ఇన్నేళ్లు కష్ట పడుతూ వస్తున్నాడు. అలాంటి ప్రభాస్ సినిమా మీద ఆఖరి నిమిషం లో, రిలీజ్ దగ్గర అవుతూ ఉండటం తో నెగటివిటీ వచ్చి చేరడం వలన, కష్ట పడి పనిచేస్తున్న టీమ్ నిరుత్సాహ పడుతున్నారు. ఎలాగైనా ఈ సినిమా విజయం సాధిస్తే అదే అందరికీ ఒక సమాధానం అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -