హీరోయిన్ సమంత పుట్టిన రోజు నేడు.ఇటీవలే అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టిన సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తుంది.పెళ్లైన తరువాత మరింత స్పీడ్ పెంచేసింది సమంత.ఇటీవలే ‘రంగస్థలం’తో సూపర్ హిట్‌ను అందుకున్న సమంత మహనటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రతి ఏడాది ఎదో ఒక విధంగా నాగ చైతన్యతో ఎంజాయ్ చేస్తుంది. కానీ ఈ సారి సమంత షూటింగ్ పనుల్లో బిజీగా ఉండి సెట్స్ లోనే సెలబ్రేట్ చేసుకుంది.
ప్రస్తుతం సమంత యూ టర్న్ అనే కన్నడ రీమేక్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడే చిత్ర యూనిట్ కేక్ కట్ చేయించి సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నటుడు ఆది పినిశెట్టి కూడా వేడుకలో పాల్గొన్నాడు. సమంత 31వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది.ఇక హీరో నాగచైతన్య సవ్యసాచి సినిమా షూటింగ్‌లో బిజి బిజిగా ఉన్నాడు.
