టాలీవుడ్ నటి జ్యోతి గుర్తుందా..? గుర్తు ఉండే ఉంటుందిలేండి. ఎందకంటే ఆమె టాలీవుడ్ వ్యాంప్ క్యారెక్టర్స్‌లో ఎక్కువుగా నటించింది. గత కొంతకాలంగా ఈ అమ్మడుకు సినిమాలలో సరిగా అవకాశాలు రావడం లేదు. తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ మొదటి సీజన్ కనిపించింది జ్యోతి. మొదటి సీజన్‌లో ఫస్ట్ ఎలిమినేషన్‌గా బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చేసింది. తాజాగా ఈ భామ టాలీవుడ్ సన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండపై బొల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా జ్యోతి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు.. పవన్ కల్యాణ్‌తో నటించాలని నాకు బాగా కోరికగా ఉండేది.
కాని ఆయన సినిమాలను వదిలేసి రాజకీయాలలో బిజీగా మారిపోయారు. పవన్ కల్యాణ్ తరువాత నాకు విజయ్ దేవరకొండతో నటించాలని కోరికగా ఉందని చెప్పి తన మనస్సులో మాటను బయట పెట్టింది. ఇక్కడిదో ఆగితే బాగుండేది, కాని విజయ్ దేవరకొండకు షర్ట్ లేకుండా తనతో నటించాలని ఉందంటూ తన మనసులో కోరికను బయటపెట్టింది. విజయ్ దేవరకొండ రాకముందు వరకు నాని అంటే ఇష్టమని , కాని విజయ్ దేవరకొండ వచ్చిన తరువాత ఆ ఇష్టం నాని నుంచి విజయ్ దేవరకొండ మీదకు మారిందని తెలిపింది.
- Advertisement -
విజయ్ దేవరకొండపై బొల్డ్ కామెంట్స్ చేసిన నటి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
