Monday, May 13, 2024
- Advertisement -

పాక్ ఉగ్ర‌వాద బండారాన్ని బ‌య‌ట‌పెట్టిన మాజీ అధ్య‌క్షుడు ముషారఫ్‌…

- Advertisement -

ఉగ్రవాదులకు పాక్‌ స్వర్గధామంగా మారిందని ప్రపంచ దేశాలు నమ్ముతున్నప్పటికీ…పాక్ మాత్రం స‌సేమీరా అంటోంది. పాక్ భూభాగం నుంచి అనేక ఉగ్ర‌దాడులు జ‌రుగుతున్నా ఇందులో త‌మ‌కు సంబంధం లేదంటూ బుకాయించే ప్ర‌య‌త్నం ప్ర‌తీసారి చేస్తోంది పాక్‌. అయితే తాజాగా పాక్ ఉగ్ర‌వాద భండారాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేశారు మాజీ అధ్య‌క్షుడు ముష‌రాఫ్‌.

మొద‌టినుంచి ఉగ్రవాదాన్ని ఆ దేశం పెంపొందిస్తోందంటూ భారత్ చేస్తున్న వాదనలకు బలమైన ఆధారాలను అందించారు. భారత్‌పై దాడులకు జైషే మహమ్మద్‌ను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఉపయోగిస్తుండేదని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2003లో జైషే సంస్థ తనను రెండు సార్లు చంపడానికి యత్నించిందని అన్నారు.అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డానన్నారు. పాకిస్థాన్ జర్నలిస్ట్ నదిమ్ మాలిక్‌ జరిపిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను తెలిపారు. ప్ర‌స్తుతం పాక్ జైషేపై చర్యలు తీసుకోవడాన్ని ఆయన స్వాగతించారు.

అంతర్జాతీయంగా ఒత్తుడులు తలెత్తడంతో .. పాక్ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. జేషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అస్ఘర్‌తో పాటు 43 మంది నాయకులను నిర్బంధంలోకి తీసుకోవాలంటూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయంగా ఒత్తుడులు తలెత్తడంతో .. పాక్ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. జేషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అస్ఘర్‌తో పాటు 43 మంది నాయకులను నిర్బంధంలోకి తీసుకోవాలంటూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -