Tuesday, April 30, 2024
- Advertisement -

అక్కినేని హీరోని భయపెడుతోన్న దిల్ రాజు హీరో

- Advertisement -

దిల్ రాజు పవన్ కళ్యాణ్ పై పగ తీర్చుకుంటున్నాడు అనుకునే లోపు యు టర్న్ తీసుకుని అక్కినేని ఫ్యామిళీపైకి వచ్చాడు. అఖిల్ హలో అంటూ క్రిస్ మస్ కు పలకరించడానికి వస్తుంటే… నేను కూడా వస్తున్నా అంటూ దిల్ రాజు నానితో మిడిల్ క్లాస్ అబ్బాయిని దింపేస్తున్నాడు. ఇపుడిదే టాలీవుడ్లో హాట్ డిస్కషన్ అయిపోయింది. ఇంకో వైపు అల్లు శిరీష్ సైతం ఒక్క క్షణం అంటూ క్రిస్టమస్ కు రావడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అల్లు శిరీష్ కు ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ అంటూ ఏం లేదు.

ఎందుకంటే అల్లు అరవింద్ చేతిలో థియేటర్లున్నాయి. కాని నాగ్ చేతిలో థియేటర్లు ఎక్కడ. దిల్ రాజు చేతిలోనే మెజారిటీ థియేటర్లు ఉన్నాయి కాబట్టి నాని మిడిల్ క్లాస్ అబ్బాయి సేఫ్ జోన్లో ఉన్నట్లే లెక్క. ఫైనల్ గా ఇక్కడ ఇబ్బంది పడేది అక్కినేని కుర్రాడే. బహుశ నాగార్జునతో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలుతో దిల్ రాజు ఇలా కావాలని హలో అనకుండా అఖిల్ ను చేస్తున్నాడా అనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -