Friday, May 17, 2024
- Advertisement -

ఆ యాంక‌ర్ ఓ వ్య‌భిచారి : టాలీవుడ్ ద‌ర్శ‌కుడు

- Advertisement -

సూప‌ర్ హిట్ సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడు.. ఇటీవ‌ల త‌న జీవితంలో ఎదురైన సంఘ‌ట‌న‌ల‌ను ఓ మీడియాతో పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా ఓ విలేక‌రి అత‌డి ఒంటిపై ఉన్న ప‌చ్చ‌బొట్టు గురించి అడ‌గ్గా విషాదంలో మునిగాడు. త‌న జీవితంతో ఓ యాంక‌ర్ ఆడుకుంద‌ని.. త‌న‌ను ప్రేమించి వేరొక‌డిని పెళ్లాడింది అని.. ఆమెను అమ్మ నా బూతులు తిట్టాడు.

యజ్ఞం, వీరభద్ర, ఆటాడిస్తా, పిల్లా నువ్వు లేని జీవితం, సౌఖ్యం సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడు ఏఎస్ ర‌వికుమార్ ఇటీవ‌ల ఓ మీడియాతో మాట్లాడారు. త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ను విపులంగా వివ‌రించాడు. ఒకానొక స‌మయంలో ఆమెపై బండ బూతులు తిట్టేశాడు. అప్ప‌ట్లో ఓ ప్ర‌ముఖ టీవీ చాన‌ల్ యాంకర్‌పై ఫ‌స్ట్ ల‌వ్‌, ఇన్‌ఫాక్చువేష‌న్ ఉంది అని చెప్పారు. అయితే ఆపాటికే ఆమె ఓ వ్య‌భిచారి అని ఆరోపించాడు. ఆమె కోసం అర్థ‌రాత్రి 11 గంట‌ల‌కు జూబ్లీహిల్స్ నుంచి సోమాజిగూడ వ‌ర‌కు న‌డుచుకుంటూ వెళ్లేవాడ‌ట.

ఆమె నుంచి త‌న‌ను బ‌య‌ట‌కు లాగుదామ‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించాడ‌ని చెప్పారు. ఆ దొంగ‌ము.. త‌న‌ను ల‌వ్ చేస్తున్నా.. అని చెప్పి వేరొక‌డితో పెళ్లి సెటిల్ చేసుకుంద‌ని తెలిపారు. అప్పుడు ఫుల్‌గా మందు కొట్టేసి వాళ్ల ఇంటికెళ్లి గోల‌గోల‌ చేశాన‌ని చెప్పుకొచ్చారు. ఆ స‌మ‌యంలో అత‌డు సీరియల్స్ చేస్తుండేవాడు. ఆమెను మంచి టెక్నీషియన్ చేద్దామనుకున్నాడు. కథ, మాటలు అన్నీ తానే రాసి, కో డైరెక్టర్‌గా ఉంటూ డైరెక్టర్‌గా ఆమె పేరు వేసినా ప‌ట్టించుకోలేదు.

కానీ త‌న‌ను ప్రేమ విషయంలో మోసం చేయ‌డంపై ఇప్ప‌టికీ ఆగ్ర‌హంగా ఉన్నాడ‌ట‌. ఆమె పెళ్లయిపోయాక తన భర్తతో కలిసి దసపల్లా హోటల్‌కు రాగా రెండు దండలు తీసుకుని వారికిచ్చి దండలు మార్పించానని చెప్పారు. ఆ త‌ర్వాత బ్లేడుతో త‌న‌ వేలు కట్ చేసి రక్తంతో ఆమె పెళ్లి చేసుకున్న వ్య‌క్తికి తిలకం దిద్దాడు.

తాను ప్రేమలో ఓడిపోయినా నువ్వు గెలిచావు అని అతడిని అభినంచాన‌ని మీడియాతో చెప్పారు. తర్వాత బాధతో హైదరాబాద్ వదిలి వెళ్లిపోతూ రైల్వే స్టేషన్ వద్ద ఆమె పేరు ఒంటిపై పచ్చబొట్టు వేయించుకున్నాను ఈ విధంగా ఆమె గురించి ర‌వికుమార్ చెప్పారు. అప్పట్లో ఆమె అంటే అంత పిచ్చి ఉండేది అని భావోద్వేగ‌తంతో తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -