Tuesday, May 14, 2024
- Advertisement -

ఆరు సెకన్ల ఆ వీడియో ఆమె జీవితాన్నే మార్చేసింది

- Advertisement -

ఓవ‌ర్‌రైట్‌లో సెల‌బ్ర‌టీలుగా పాపులారిటీ సంపాదించాలంటే అంత ఈజీ కాదు. దాని వెనుక ఎంతో కృషి, క‌ష్టం ఉంటుంది. కాని ఆరు సెకెడ్ల వీడియోతో రాత్రికి రాత్రే ఓవ‌ర్‌నైలో పాపులారిటీ సంపాదించింది కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. సోషియ‌ల్ మీడియాలో స్టార్ హీరోయిన్లను క్రాస్ చేసేసింది.

హీరోయిన్లు తమన్నా, తాప్సీ లాంటి వారినే దాటేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వారియర్‌ను ఫాలో అవుతున్న వారు 45 లక్షలకు పైగానే ఉన్నారు. అంటే.. స్టార్ హీరోయిన్లకు చివరకు బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఇంతమంది ఫాలోయర్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఓవ‌ర్‌రైట్‌లోనే ఇంత పాపులారిటీ సంపాదించ‌డంతో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ సంచ‌ల‌నంగా మారింది.

అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తన పాపులారిటీని క్యాష్ చేసుకుంటోంది. సోషల్ మీడియాలో తాను అప్ లోడ్ చేసే ఒక్కో పోస్టు ద్వారా 8 లక్షల రూపాయల వరకు సంపాదిస్తోందట. ఆమెకున్న లక్షలాది మంది ఫాలోయర్ల కారణంగా పోస్టుల అప్ లోడింగ్ ద్వారా ఆమె సంపాదన ఎంత పెరుగుతుందో అంచనా వేయవచ్చు.

ఒరు అదార్ లవ్ అనే మలయాళ చిత్రంలోని ఓ పాట ద్వారా ఆమెకు ఇంత క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. 26సెకన్ల ఆ వీడియో ఆమె జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు పలు దక్షిణాది సినీ పరిశ్రమల నుంచి ఆమెకు ఆఫర్లు వస్తున్నట్లు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -