Thursday, April 25, 2024
- Advertisement -

ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ ఆ హీరోనే అంటున్న రష్మిక?

- Advertisement -

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఎంతో స్టార్ డమ్ సంపాదించుకున్న వారిలో రష్మిక మందన్నా ఒకరు. ఈమె నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలతో ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు అవకాశాలను కొల్లగొడుతోంది.

రష్మిక ప్రస్తుతం హిందీ చిత్రం ‘గుడ్‌ బై’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్ సమయంలో విరామం దొరికినప్పుడు అలా కాసేపు సరదాగా నెటిజన్లతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు రష్మిక సరదాగా సమాధానాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ మీరు స్మోకింగ్ చేస్తారా? అని అడగగా అందుకు రష్మిక నేనూ.. స్మోకింగ్ చేయడమా? నాకస్సలు నచ్చదు. స్మోకింగ్ చేసే వారి పక్కన నిలబడాలన్నా నాకు ఇష్టం ఉండదని సమాధానం చెప్పారు.

అదేవిధంగా రష్మిక మాట్లాడుతూ జీవితంలో ఎవరికీ ఏదీ ఊరికే రాదు ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదించుకోవాలని తెలిపారు. అలాగే తనకు ఆరు భాషలు వచ్చని, అయినప్పటికీ తను పర్ఫెక్ట్ కాదనే విషయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటూ ప్రశ్నించగా.. అందుకు రష్మిక విజయ్ దేవరకొండ తన బెస్ట్ ఫ్రెండ్ అనే సమాధానాన్ని తెలపడం విశేషం. ఇక తెలుగులో ప్రస్తుతం ఈ భామ అల్లు అర్జున్ సరసన “పుష్ప” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -