Thursday, April 25, 2024
- Advertisement -

సిమ్రాన్ ఐదేళ్ళు, ఆర్తీ నాలుగేళ్ళు, సమంతా మూడేళ్ళు, రకుల్ ప్రీత్ రెండేళ్ళు…… ఇక ఈ కొత్త భామ ఎన్నాళ్ళో?

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో గుర్తించగ్గ మార్పు ఇది. బ్లాక్ అండ్ వైట్ కాలంలో బేలన్స్ కరెక్ట్‌గా ఉండేది. ఆ తర్వాత నుంచీ లెక్కలు మారిపోతూ వచ్చాయి. స్టార్ ఢం పీక్స్‌కి వచ్చి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడిక ప్రేక్షకులు అభిరుచులు మారిపోతున్నాయో, లేక హీరోలు కొత్తదనం కోరుకుంటున్నారో కానీ నంబర్ ఒన్ హీరోయిన్ ట్యాగ్ దక్కించుకున్న హీరోయిన్స్ అంరదూ కూడా చాలా త్వరగా ఫేడవుట్ అయిపోతున్నారు. సావిత్ర కాలంలో హీరోయిన్స్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉండేది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారడానికి కూడా అవకాశం ఉండేది. ఇక ఆ తర్వాత తరం హీరోయిన్స్‌కి కూడా మరీ ఎక్కువ ఎక్స్‌పోజింగ్ ఉండేది కాదు కాబట్టి హీరోయిన్‌గా రిటైర్ అయ్యక కూడా అమ్మ, అక్క, వదిన క్యారెక్టర్స్ చేస్తూ ఉండేవారు. ఇక ఇప్పటి తరం హీరోయిన్స్‌కి ఆ అవకాశం లేదు. సిమ్రాన్‌తో సహా చాలా మంది హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేద్దామని ట్రై చేశారుగానీ ఎవ్వరూ కూడా నిలదొక్కుకోలేదు. అలాగే సిమ్రాన్ ఐదేళ్ళపాటు టాప్ హీరోయిన్‌గా ఉంటే, ఆ తర్వాత ఆర్తీ అగర్వాల్ కూడా ఓ నాలుగేళ్ళు హవా నడిపించింది. అందరు హీరోలతో యాక్ట్ చేయని అనుష్కలాంటివాళ్ళను పక్కన పెడితే సమంతా కూడా నంబర్ ఒన్ హీరోయిన్‌గా మూడేళ్ళపాటు హల్చల్ చేసింది. ఆ తర్వాత రకుల్ ప్రీత్ హవా మొదలైంది. అయితే గట్టిగా రెండేళ్ళలోనే రకుల్ నంబర్ ఒన్ పోస్ట్ పోయింది. తాజాగా అను ఇమ్మాన్యుయేల్ ఆ స్పాట్‌కి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మన హీరోలు ఒక హీరోయిన్ పక్కన ఒకసారి యాక్ట్ చేశాక రెండోసారి అవకాశం ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదని కూడా నిర్మాతలు అంతర్గతంగా మాట్లాడుతూ ఉంటారు. గతంలో హిట్ పెయిర్ అని చెప్పి చిరంజీవి-రాధలాంటి జంటలు చాలా సినిమాల్లో కలిసి నటించారు. అయితే ఇప్పటి తరం హీరోలు మాత్రం హిట్ పెయిర్ అన్న సెంటిమెంట్ కంటే ప్రతి సినిమాలోనూ కొత్త హీరోయిన్ ఉండాలని ఆలోచిస్తున్నారు. ఈ ఇంటర్నెట్ యుగంలో కేవలం గ్లామర్‌పైన డిపెండ్ అవుతున్న హీరోయిన్స్ లైఫ్ కూడా రెండు మూడేళ్ళకు మించి ఉండడం లేదు. ఆ గ్యాప్‌లో యాక్ట్ చేసిన సినిమాల్లోనే అమ్మడి అందాలన్నీ చూపించేసి ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా గ్లామర్ చూపించడానికి ఏమీ ఉండదు. ఆ గ్లామర్‌ని ఇష్టపడే ప్రేక్షకులు కూడా మరో కొత్త హీరోయిన్ గ్లామర్ షోను చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఇదే విషయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. నంబర్ ఒన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ మరీ ఇంత ఫాస్ట్‌గా డౌన్ అయిపోతుందని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు కావాల్సిన అందాలన్నీ పుష్కలంగా ఉన్న అను ఇమ్మాన్యుయేల్ దెబ్బకు రకుల్ కెరీర్‌పై దెబ్బపడింది. కాసిన్ని పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేసిన సమంతాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించడానికి స్కోప్ ఉంది. కానీ కేవలం గ్రామర్‌తోనే నెట్టుకొచ్చిన రకుల్ ప్రీత్ కెరీర్ మొత్తం పూర్తిగా క్లోజ్ అయ్యేలానే కనిపిస్తోంది. ఇక ఇప్పుడు నంబర్ ఒన్ దిశగా దూసుకెళ్తున్న అను ఇమ్మాన్యుయేల్ హవా ఎంతకాలం ఉంటుందో చూడాలి మరి. ఇలాంటి పరిస్థితి గురించి పూర్తిగా అవగాహన ఆయా హీరోయిన్స్‌కి కూడా ఉన్నట్టుంది. అందుకే పీక్‌లో ఉండగానే పిచ్చ పీక్‌ స్థాయి రెమ్యూనరేషన్స్ పిండుకుని ఫైనాన్షియల్‌గా మాత్రం బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతున్నారు హీరోయిన్స్. బ్లాక్ అండ్ వైట్ హీరోయిన్స్‌కి మాత్రం ఈ తెలివితేటలు పెద్దగా ఉండేవి కాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -