Tuesday, April 30, 2024
- Advertisement -

ఎంసిఎ ట్రైలర్ రివ్యూ………. నానీకి మరో హిట్టు బొమ్మ ఖాయం…. ఆ ఒక్క విషయంలో నానీ ది బెస్ట్

- Advertisement -

టాలీవుడ్‌లో ఉన్న ఇతర హీరోలెవ్వరికీ లేని బలం నానీకి ఒకటుంది. అందుకే ఇంతకుముందు కొన్ని రోటీన్ కథల్లో యాక్ట్ చేసినా…….ఇప్పుడు మరోసారి ఎంసిఎ అంటూ మిడిల్ క్లాస్ అబ్బాయి కథతో వస్తున్నా హిట్టు బొమ్మ అన్న నమ్మకం మాత్రం కలుగుతోంది. నాగార్జున నిర్మాతగా అఖిల్ హీరోగా ఎన్నో ఆశల మధ్య వస్తున్న ‘హలో’ కి పోటీగా రంగంలోకి దిగుతున్న నానీ ఈ సారి కూడా ఖాయంగా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఓన్ చేసుకునేలాగా తీర్చిదిద్దిన కథ……ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల నుంచి వచ్చిన ఓ కుర్రాడి హీరోయిజం…..ఇక ఈతరం యువతరం అంతా ఓన్ చేసుకునేలాంటి లవ్ స్టోరీ……ఇవే ఎంసిఎ సినిమా బలాలు. ట్రైలర్ చూస్తూ ఉంటే ఇవి రెండూ కూడా బలంగా సెట్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ హీరోలు హీరోయిన్స్‌ని టీజ్ చేయడాన్నే మనం ఎక్కువగా తెరమీద చూశాం. ఈ సినిమాలో ఆ ట్రాక్‌ని రివర్స్‌లో చేసినట్టుగా కనిపిస్తోంది. సాయి పల్లవి లాంటి సూపర్ టాలెంటెడ్ హీరోయిన్……. ఆ క్యారెక్టర్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్ళి ఉంటుందని చెప్పడానికి సందేహం అక్కర్లేదు.

ఇక ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల ముగ్గురి కెరీర్‌లోనూ ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన సినిమాల్లో యాక్ట్ చేసిన భూమిక వదిన క్యారెక్టర్‌లో భలేగా ఒదిగిపోయింది. ఈ సినిమాకు ఇది చాలా పెద్ద అస్సెట్ అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. నానీ, సాయిపల్లవి, భూమికల మధ్య సీన్స్ అన్నీకూడా బెటర్‌గానే వచ్చి ఉంటాయి అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఎందుకంటే ముగ్గురూ కూడా సీన్‌లో పెద్దగా కంటెంట్ లేకపోయినా యాక్టింగ్ స్కిల్స్‌తో నిలబెట్టగల సమర్థులే. ఇక లేటెస్ట్ కామెడీ స్టార్ ప్రియదర్శి కామెడీ కూడా నవ్వులు పండించడం ఖాయం. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్‌ని కూడా బాగానే యాడ్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీ చూద్దామని థియేటర్‌కి వచ్చిన వాళ్ళకు ఇబ్బంది లేని స్థాయిలో ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నిలబడడం ఖాయం. అలాగే కథ అయితే మరీ రొటీన్‌గా కనిపిస్తోంది. అయినప్పటికీ ఇప్పటి వరకూ ఇలాంటి రొటీన్ కథలతోనే హిట్స్ కొట్టాడు నానీ. అయితే వాటిలో కథనం, సీన్స్ మాత్రం కాస్త ఇంప్రెసివ్‌గా ఉండేవి. దిల్ రాజు గత సినిమాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సినిమాలో కూడా కాస్త క్వాలిటీ అవుట్‌పుట్‌నే ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. మొత్తంగా ట్రైలర్‌తో అయితే డిసప్పాయింట్ చెయ్యలేదు నానీ. భూమిక, సాయిపల్లవిలు ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నారు. ఇక ఇతర హీరోలందరికీ లేని ఒక బలం నానీకి ఉంది. ఆ బలం ఈ సినిమాలో ఇంకా బలంగా కనిపిస్తోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మామూలుగానే పక్కింటోడిలా ఉంటాడు నానీ. ఇక ఈ సిినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్ర కావడంతో మరి కాస్త ఎక్కువగా ఓన్ చేసుకునేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొడతానంటున్న దిల్ రాజు ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -