Wednesday, April 17, 2024
- Advertisement -

2017 దిల్‌రాజుదే… సంవ‌త్స‌రంలో 6 విజ‌యాలు

- Advertisement -
  • భార్య ఆశీర్వాద పుణ్య‌మే!
  • స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడిగా పేరు

2017 సంవ‌త్స‌రం దిల్‌రాజుకు చాలా క‌లిసిసొచ్చింది. సంవ‌త్స‌రం ఆరంభం నుంచి మొద‌లైన విజ‌యాల బాట సంవ‌త్స‌రం ముగింపు వ‌ర‌కు కొన‌సాగుతోంది. వ‌రుస పెట్టి నిర్మిస్తున్న సినిమాల‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతున్నారు. తాను నిర్మిస్తున్న ప్ర‌తి సినిమాను ప్రేక్షకాద‌ర‌ణ ఉండ‌డంతో దిల్‌రాజు స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా పేరు పొందాడు. దిల్ సినిమాతో నిర్మాత‌గా మొద‌లైన రాజు ప్ర‌యాణం ఏళ్లుగా దిగ్విజయంగా కొన‌సాగుతోంది. పెద్ద పెద్ద నిర్మాత‌ల‌కు సాధ్యం కానీ రీతిలో దిల్ రాజు దూసుకుపోతున్నాడు. నిర్మాత‌ల్లో దిల్ రాజుకు 2017 గోల్డెన్ ఈయ‌ర్‌గా చెప్ప‌వ‌చ్చు. డిస్ట్రిబ్యూట‌ర్‌గా జీవితాన్ని ప్రారంభించిన రాజు ఇప్పుడు స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా పేరు పొందుతున్నాడు.

ఆరంభ‌మే అద్భుత విజ‌యం
2017 జ‌న‌వ‌రిలో సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన సినిమాల్లో శ‌త‌మానం భ‌వ‌తి ఒక‌టి. శ‌ర్వానంద్‌, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌కాశ్‌రాజ్‌, జ‌య‌సుధ న‌టించిన ఈ సినిమా తీవ్ర పోటీని కూడా త‌ట్టుకొని నిల‌బ‌డింది. కుటుంబ స‌మేతంగా చూసే సినిమాగా నిలిచి అద్భుత విజ‌యం అందుకుంది. త‌ర్వాత ‘నేను లోకల్’ అంటూ నాని సినిమా కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో దిల్‌రాజుకు మంచి లాభాలు వ‌చ్చాయి. దీని తర్వాత అల్లు అర్జున్‌, పూజా హెగ్డేతో వ‌చ్చిన సినిమా దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ కమర్షియల్‌గా హిట్‌గా నిలిచింది. దీనిపై ఎన్ని వివాదాలు వ‌చ్చినా అవ‌న్నీ తొల‌గిపోయి సినిమాకు వ‌సూళ్లు బాగా వ‌చ్చాయి.

వ‌రుణ్‌తేజ్‌, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో శేఖ‌ర్ క‌మ్ముల తీసిన సినిమా ‘ఫిదా’. ఈ సినిమాతో రాజు అద్భుత విజయాన్ని అందుకున్నారు. త‌న కెరీర్‌లో పెద్ద హిట్ అందుకున్న‌ది కేవ‌లం సినిమానే. ఈ సినిమాలో భానుమ‌తి పేరుతో సాయి ప‌ల్ల‌వి చేసిన న‌ట‌న అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. త‌న భార్య అనిత మ‌ర‌ణం త‌ర్వాత దిగాలుగా ఉన్న దిల్‌రాజుకు ఈ సినిమా అద్భుత విజ‌యం అందించింది. ఈ సినిమాను త‌న భార్య‌కు అంకితం చేశారు. ఆ బాధ‌ నుంచి ఫిదా విజ‌యం దూరం చేసింది.

ర‌వితేజ‌, మెహ్రీన్‌తో తీసిన రాజా ది గ్రేట్ సినిమా ఇటు ర‌వితేజ‌కు, దిల్‌రాజుకు మంచి సినిమాగా నిలిచింది. ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా వ‌చ్చిన ఈ సినిమా వ‌సూళ్ల పంట పండించింది. ర‌వితేజకు చాన్నాళ్ల‌కు మంచి విజ‌యం ల‌భించింది. ఇక మెగా అల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో తీసిన సినిమా జ‌వాన్ ఒక్క‌టి విఫ‌ల‌మైంది. ఈ ఒక్క‌టీ త‌ప్ప అన్నీ విజ‌యం సాధించింది.

ఇంకా ఒక్క‌టీ ఈ డిసెంబ‌ర్‌లో ఉంది. అది నాని, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్న మిడిల్ క్లాస్ అబ్బాయ్ (ఎంసీఏ). ఈ సినిమా ఎప్పుడో విజ‌యం సాధిస్తుంద‌ని అంద‌రీ నోళ్ల‌ల్లో నానుతున్న మాట‌. దిల్ రాజుకు ఈ సినిమా రూపేణ ఎప్పుడో విజ‌యం సాధించింది. ఇక థియేట‌ర్ల‌లో వ‌చ్చి ఆడాల్సిందే ఆల‌స్యం. నానిపై న‌మ్మ‌కంతో తీసిన సినిమాల‌న్నీ సూప‌ర్ హిట్టే. నాని, దిల్‌రాజు కాంబినేష‌న్ స‌క్సెస్‌ఫుల్ జోడీగా అభివ‌ర్ణిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -