Thursday, March 28, 2024
- Advertisement -

ఈ ఏడాది కుర్ర హీరోల‌దే

- Advertisement -
  • 2017 నాని, రానా, శ‌ర్వా, విజ‌య్‌, అవ‌స‌రాల‌దే
  • తెలుగు తెర‌పై హిట్ కొట్టిన చిన్న సినిమాలు

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ 2017 సినిమాల్లో కుర్ర హీరోళ్లు జోరు చూపించారు. తెలుగు ప‌రిశ్ర‌మ‌ను ఆదుకున్న‌ది వారే. ఒక్క బాహుబ‌లి సినిమా వ‌దిలేస్తే మిగ‌తంతా ఏడాదంతా కుర్ర హీరోలు సినీ ప‌రిశ్ర‌మ‌ను స‌జీవంగా ఉంచారు. వాళ్లు రాకుంటే సినిమా క‌లెక్ష‌న్లు నిల‌య్యేవి. నాని, శ‌ర్వానంద్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, ద‌గ్గుబాటి రానాలు సినీ ప‌రిశ్ర‌మ‌లో రాణించారు. వీరి సినిమాలు ప్రేక్ష‌కుల‌ను, అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమాల‌తో థియేట‌ర్లు ఖాళీగా లేకుండా కొంచెం ప్రేక్ష‌కుల‌తో నిండి ఉన్నాయి. ఒక్క సంక్రాంతి, వేసవి కాలాన్ని న‌మ్ముకొని పెద్ద పెద్ద హీరోలు థియేట‌ర్ల‌లోని రావ‌డం ఒక సంప్ర‌దాయంగా మారింది. ఏదైనా పండుగ ఉంటేనే అభిమానులకు పండుగ‌కు కానుకగా సినిమాతో వ‌స్తారు. ఆ విధంగా వ‌చ్చిన వాళ్లెవ‌రూ అభిమానుల దాహం తీర్చ‌లేదు.

2017 సంక్రాంతి పండుగ‌కైతే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఏమవుతుందో ఏమోన‌ని తెలుగు రాష్ట్రాల్లో ఓ భావోద్వేగ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఆ స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి, బాల‌కృష్ణ‌, శ‌ర్వానంద్‌, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి సినిమాల‌తో వ‌చ్చారు. అందులో ఇద్ద‌రు పెద్ద హీరోలు సోసో అనిపించుకున్నా శ‌ర్వానంద్ హిట్ కొట్టాడు. శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి పెద్ద సినిమాలు థియేట‌ర్ల‌లోంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయినా ఈ సినిమా నిలిచింది. కుటుంబ స‌మేతంగా వ‌చ్చి సినిమాను చూశారు. ఆ త‌ర్వాత రాధగా వ‌చ్చి శ‌ర్వా నిరాశ‌ప‌రిచాడు. ఆ సినిమా బాగున్నా ఎందుకో హిట్ కాలేదు. ఆ త‌ర్వాత మ‌హానుభావుడు సినిమాతో వ‌చ్చాడు. అతిశుభ్ర‌త అనే జ‌బ్బుతో వ‌చ్చి కామెడీ పండించి త‌న ఖాతాలో హిట్ వేస్కొని 2017కు ముగింపు ప‌లికాడు.

ఇక నాని ముచ్చ‌ట‌కొస్తే అత‌డికి ఈ ఏడాది రెండు హిట్లు వ‌చ్చాయి. హిట్ల మీద హిట్లు ఉన్నాయి. త‌న స‌హ‌జ న‌ట‌న‌తో నాని న్యాచుర‌ల్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. నేను లోక‌ల్ అంటూ వ‌చ్చి హిట్ అందుకున్న నాని త‌ర్వాత నిన్ను కోరిగా వ‌చ్చి మ‌ళ్లీ విజ‌యం సాధించాడు. ఫీల్ గుడ్ మూవీల‌తో వ‌స్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. కొంటెత‌నంతో త‌న స‌హ‌జ న‌ట‌న‌తో మంచి క‌థ‌ల ఎంపిక‌తో టాలీవుడ్‌లో స‌క్సెస్‌ఫుల్ యూత్ హీరో అంటే నాని అని చెబుతారు. ఇక డిసెంబ‌ర్ 22వ తేదీన విడుద‌లయ్యే మిడిల్ క్లాస్ అబ్బాయ్ (ఎంసీఏ) హిట్ టాక్ వ‌చ్చేసింది. ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కులు విప‌రీతంగా చూసేశారు. ఇంకా సినిమా హిట్టేన‌ని అనుకోవాలి. హిట్ కాకున్నా ఓ మోస్త‌రుగన్నా ఆడుతుంది.

తెలంగాణ యాస‌, హైద‌రాబాద్ కుర్రాడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ అద‌ర‌గొడుతున్నారు. పెళ్లిచూపులు సినిమాతో ఫేమ‌సైన ఈ న‌టుడు ఈ సంవ‌త్స‌రం ద్వార‌క‌, అర్జున్‌రెడ్డి సినిమాల‌తో వ‌చ్చాడు. ద్వార‌క సోసో ఆడింది. దాని త‌ర్వాత అర్జున్‌రెడ్డి సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఎన్నో వివాదాలు, ఉద్రిక్త‌త‌ల న‌డుమ సినిమా థియేట‌ర్ల‌లో చాలా రోజులు కొన‌సాగింది. దీంతో మోస్ట్ వాంటెడ్ న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ అయ్యాడు.

ఇక బాహుబ‌లిలో భ‌ళ్లాల దేవ‌గా రానా ప్ర‌పంచ గుర్తింపు పొందిన న‌టుడు బాహుబ‌లి క‌న్‌క్లూజ‌న్‌లో వ‌చ్చాడు. ఆ త‌ర్వాత రెండు సినిమాల్లో హీరోగా న‌టించాడు. కొత్త ద‌ర్శ‌కుడితో ప్ర‌యోగాత్మ‌కంగా ఘాజీ సినిమాతో ద‌గ్గుబాటి రానా వ‌చ్చాడు. ఆ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. హిందీలో కూడా బాగా ఆడింది. దాని రీమేక్ హ‌క్కుల కోసం చాలా మంది పోటీప‌డుతున్నారు. ఆ త‌ర్వాత‌ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో రానా మంచి న‌ట‌న క‌న‌బ‌ర్చాడు. ఈ సినిమా హిట్‌గా నిలిచింది.

న‌టుడు, ద‌ర్శ‌కుడు అవ‌స‌రాల‌ శ్రీనివాస్ ఈ ఏడాదిలో రెండు సినిమాలు చేశాడు. ఆ రెండు హిట్ట‌య్యాయి. బాబు బాగా బిజీ ఆ టైపు సినిమాతో కొంచె హాస్యంతో పాటు సందేశాన్ని అందిస్తూ సినిమాలో న‌టించాడు. ఇక‌ అమీతుమీ సినిమా హాస్య‌ప్ర‌ధానంగా సాగింది. అడ‌వి శేష్‌తో క‌లిసి న‌టించాడు. ఈ సినిమా థియేట‌ర్ల‌లో బాగానే ఆడింది.

ఇక నాగ‌బాబు త‌న‌యుడు ఈ ఏడాది రెండు సినిమాల‌తో వ‌చ్చాడు. ఒక సినిమా డిజాస్ట‌ర్ కాగా రెండో సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. మిస్ట‌ర్ సినిమాగా లావ‌ణ్య త్రిపాఠితో వ‌చ్చి ప‌రాజ‌యం పొందాడు. ఆ త‌ర్వాత సాయిప‌ల్ల‌వితో క‌లిసి వ‌రుణ్‌తేజ్ వ‌చ్చి తెలుగు సినీ ప్రేక్ష‌కులను ఫిదా చేశారు. హీరో క‌న్నా హీరోయిన్ సాయిప‌ల్ల‌వి న‌ట‌న అద్భుత హగా ఉంది. ఆమెతోనే సినిమా ఆడిందంటే అతిశ‌యోక్తి కాదు. తెలంగాణ అమ్మాయిగా సాయిప‌ల్ల‌వి అద్భుతంగా న‌టించింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -