Sunday, April 28, 2024
- Advertisement -

టాలీవుడ్లో ఎవడండి హీరో…

- Advertisement -

సినిమా హీరోలు సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రేక్షకులకు భాగానే చేరువవుతున్నారనే చెప్పాలి. అందుల్లోను స్టార్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడంతో వారి సినిమా రిలీజ్ టైమ్లో … సోషల్ మీడియాలో క్రేజ్.. ఎ రేంజ్లో ఉంటుంది. యూత్ నే కాకుండా….. ఇప్పుడు అందరు సోషల్ మీడియా ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. అయితే మన టాలీవుడ్ హీరోలకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉందని చెప్పాలి. టాలీవుడ్ హీరోల పుట్టిన రోజులకి వారి ఫ్యాన్స్ కాస్త ఎక్కువగా సెలబ్రేట్ చేస్తున్నారనే విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో వారి జన్మదిన వేడుకలకు శుభాభినందనలు బాగానే అందుతాయి. అయితే రీసెంట్ గా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోలు రికార్డ్ స్థాయిలో విషేస్ ని అందుకున్నారట. ముఖ్యంగా ఒక్కరోజులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరికంటే ఎక్కువ స్థాయిలో విషేష్ ని అందుకున్నారని తెలిసింది.

#HBDLEADERPAWANKALYAN అనే హ్యాష్‌ట్యాగ్‌తో దాదాపు 2.9 మిలియన్లకు పైగా ట్వీట్స్ వచ్చాయట. ఇక ఆ తర్వాత స్థానంలో రీసెంట్ గా పుట్టిన రోజును జరుపుకున్న ప్రభాస్ #HBDDARLINGPRABHAS హ్యాష్‌ట్యాగ్‌ తో 2.1మిలియన్లకు పైగా విషెస్ అందాయి. వారి తర్వాత మహేష్ #HBDMAHESHBABU హ్యాష్‌ట్యాగ్‌తో సుమారు 1.1మిలియన్ల గ్రీటింగ్స్ ని అందుకోగా.. జూనియర్ ఎన్టీఆర్ కు #HAPPYBIRTHDAYNTR హ్యాష్‌ట్యాగ్‌తో 6.90లక్షల మంది శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -