Monday, April 29, 2024
- Advertisement -

ఈ అందమైన హీరోయిన్ ఓ హిజ్రా అని మీకు తెలుసా..?

- Advertisement -

సినిమాల్లో హీరోయిన్, హీరో లు కామన్ గా కనిపిస్తుంటారు. జెండర్ ని బట్టి వారిని డిసైడ్ చేస్తారు. కనీ ఓ హిజ్రా ఇప్పటివరకు సినిమాల్లో నటించింది లేదు.. వారి పాత్రలు చేసిన హీరోలు మాత్రం సూపర్ హిట్ కొట్టారు. కనీ డైరెక్ట్ గా వారెప్పుడు సినిమాల్లో నటించలేదు. కానీ మలయాళంలో ఓ హీరోయిన్ హిజ్రా అన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది..

2018 సంవత్సరంలో ప్రముఖ తమిళ దర్శకుడు రామ్ దర్శకత్వం వహించినటువంటి పెరంబు అనే చిత్రం ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది…ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా మమ్ముట్టి, అంజలి అమీర్ నటించారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అంజలి అమీర్ తన అందంతో తమిళ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వసూళ్లను కూడా సాధించి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఇప్పటి వరకూ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అంజలి అమీర్ ఓ ట్రాన్స్ జెండర్. కానీ ఈ చిత్రం చూస్తున్నంత సేపు మనకు అంజలి అమీర్ఎక్కడా కానీ ఆమె ఓ ట్రాన్స్ జెండర్ అన్న భావన కలగదు. ఈ అమ్మడు అందం తోనే కాకుండా తన నటన పరంగా కూడా పలు సినిమా అవకాశాలు దక్కించుకుంది. అంతేకాక తమిళ్ బిగ్ బాస్ మొదటి సీజన్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది. అయితే ఆ సమయంలో కొంతమేర అనారోగ్య కారణాల వల్ల అనుకోకుండా బయటికి వచ్చింది. అయితే తను హీరోయిన్ గా నటించిన టువంటి పెరంబు చిత్రం మంచి హిట్ అవడంతో అప్పట్లో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ ఫేమ్ ని దక్కించుకుంది. కానీ ఈ మధ్య కాలంలో ఏమైందో ఏమో కానీ సినీ పరిశ్రమలో అస్సలు కనిపించడం లేదు. దీంతో పలువురు అంజలి అమీర్ అభిమానులు ఆమెకు ఏమైనా అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు. అలాగే మరికొంతమంది మాత్రం హిజ్రాలను గౌరవిస్తూ అంజలి అమీర్ కి హీరోయిన్ గా నటించేందుకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు గాను స్టార్ హీరో మమ్ముట్టి కి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -