Monday, May 20, 2024
- Advertisement -

అందాలు ఆరబోసిన నిఖిల్‌, సందీప్‌కిష‌న్ హీరోయిన్‌

- Advertisement -

ప్ర‌చారం అనేది ఉత్ప‌త్తులు, బ్రాండ్‌ల‌కు ఎంతో అవ‌స‌రం. ఎలాగైనా చేసి త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించేందుకు.. త‌మ ప్రొడ‌క్స్ట్‌కు విక్ర‌యాలు పెంచుకునేలా కొత్త కొత్త ప్ర‌చార మార్గాలు అన్వేషిస్తుంటారు. ఆ క్ర‌మంలో కొన్ని కొత్త పుంత‌లు తొక్కి ప్ర‌చారం చేస్తుంటారు. ఇప్పుడు అదే బాట‌లో ఓ నెట్‌వ‌ర్క్ సంస్థ ఓ హీరోయిన్ అందాల‌తో ప్ర‌చారం చేప‌ట్టింది.

ఆ హీరోయిన్ యువ న‌టుడు నిఖిల్‌తో న‌టించిన త్రిదా చౌద‌రి. ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాలో మెరిసిన త్రిదా చౌదరి సినిమాలు లేక‌పోవ‌డంతో మోడలింగ్‌లో బిజీగా అయ్యింది. ఈ భామ ఇప్పుడు ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న కోసం టూ పీస్‌లో మెరిసి హాట్‌హాట్‌గా క‌నిపించింది.

చిన్న నిక్కర్ జీన్స్ వేసుకుని బికినీలాంటి కాస్ట్యూమ్‌తో గాగుల్స్ పెట్టుకొని త్రిదా స్టిల్ ఇచ్చింది. స్కై రోం సాలిస్ అనే నెట్వర్క్ బ్రాండ్ త‌న ప్ర‌చార కార్య‌క్ర‌మాల కోసం త్రిదా ఈ విధంగా అందాలు ఆరబోసింది.

తాను ఎక్కడ ఉన్నా స్కై రోం తో అత్యధిక స్పీడ్ ద్వారా సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. ఇటీవ‌ల యువ న‌టుడు సందీప్ కిషన్‌తో ‘మనసుకు నచ్చింది’ సినిమాలో కూడా బికినీలతో ఫుల్‌గా క‌నిపించింది. అయినా సినిమా అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో ఈ విధంగా మోడ‌లింగ్ చేస్తూ బిజీగా క‌నిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -