Wednesday, May 1, 2024
- Advertisement -

గూడ‌ఛారిగా త్రిష బిజీ

- Advertisement -

తెలుగులో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు దూర‌మైన త్రిష త‌మిళ్‌లో మాత్రం సినిమాల మీద సినిమాలు చేసేస్తోంది. అప్పుడు గ్లామ‌ర్ పాత్ర‌కు అవ‌కాశం ఇచ్చిన త్రిష ఇప్పుడు న‌ట‌న‌కు పెద్ద‌పీట వేస్తోంది. న‌ట‌కు ప్రాధాన్యం ఉన్న సినిమాల‌ను చేస్తూ బిజీబిజీగా ఉంది. ప్ర‌స్తుతం ఆమె చేతిలో ఐదు సినిమాల‌తో ఊపిరి స‌ల‌ప‌నంత ప‌నితో ఉంది. మూడు పదులు వ‌య‌సు దాటినా త్రిష‌కు అవకాశాలను వ‌రుస‌గా వ‌స్తున్నాయి.  ఇటీవల సామి-2 సినిమా నుంచి తప్పుకోవ‌డం త్రిష వివాదాస్ప‌ద‌మైంది. ఆ విష‌యం ఏం పట్టించుకోకుండా సినిమాల‌తో బిజీ అయిపోయి తన పని తాను చేసుకుంటూపోతోంది.

ప్ర‌స్తుతం త్రిష బాలా శిష్యుడు వర్నిక్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీక‌రించింది. సురభి కీలక పాత్రలో కనిపించే ఈ సినిమాకు ”కుట్రపయిర్చి” అనే టైటిల్ ఖరారు చేశారు. 1980లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష గూఢచారిగా కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సినిమాకు ముందే అరవింద్ స్వామికి జోడీగా నటించిన సదురంగవేట్టై-2 ఈనెల మూడో వారంలో విడుదల కానుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -