Monday, April 29, 2024
- Advertisement -

పట్టాలపైకి సూర్య త్రివిక్రమ్ సినిమా

- Advertisement -

తమిళ స్టార్ సూర్యకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సింగమ్ లాంటి సూర్య సినిమాలు.. తెలుగులో భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి. అందుకే.. తెలుగు మార్కెట్ ను పెంచుకునేందుకు సూర్య తన ప్రతి సినిమానీ ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు.

మూవీ ప్రమోషన్ల కోసం చాలాసార్లు హైదరాబాద్ కూ వస్తున్నారు ఇలా వచ్చినప్పుడల్లా.. డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు అని చాలా మంది సూర్యను అడుగుతూ ఉంటారు. ఇన్నాళ్లకు ఆ ప్రశ్నకు సమాధానం వినిపిస్తోంది.

కొన్నాళ్లుగా.. ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సూర్య సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లకు అది పట్టాలెక్కడం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ చెప్పిన ఫ్యామిలీ బేస్డ్ ఎంటర్ టైనర్ లైన్ సూర్యకు నచ్చిందనీ.. స్టోరీ డెవలప్ మెంట్ కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని తెలుస్తోంది. అన్నీ కుదిరితే.. వచ్చే ఏడాది జులైలో షూటింగ్ మొదలై.. అదే ఏడాది రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది.

ప్రస్తుతం సింగమ్ 3 ప్రాజెక్ట్ తో సూర్య.. అ ఆ సినిమాతో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. ఇవి పూర్తి కాగానే.. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ చేయాలని ఇద్దరూ ఆలోచిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -