Sunday, May 19, 2024
- Advertisement -

ఫిర్యాదు చేస్తే గవర్నర్ స్పందిస్తారా?

- Advertisement -

విజయవాడలో వెలుగుచూసిన కాల్ మనీ ఉదంతం.. రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. టీడీపీ వైసీపీ మధ్య మాటల మంటలు పుట్టిస్తోంది. ఈ దారుణం వెనక టీడీపీ పెద్దలే ఉన్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పార్టీ అధినేత జగన్ ఓ అడుగు ముందుకు వేసి.. గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. కాల్ మనీ దందాలో సీఎం చంద్రబాబు డబ్బు కూడా ఉందని.. గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆవేశంగా కంప్లయింట్ చేశారు.

ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ.. జగన్ ఆరాటాన్ని చూసి అంతా జాలి పడాలో.. నవ్వుకుని ఊరుకుకోవాలో అర్థం కాని పరిస్థితులో ఉన్నారు. ఎందుకంటే.. ఓటుకు నోటు లాంటి పబ్లిక్ గా బయటపడిన పెద్ద పెద్ద వ్యవహారాలే కొన్నాళ్లకు చడీచప్పుడు లేకుండా పోయాయి. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది పక్కన పెడితే.. అసలు విషయం మాత్రం పూర్తిగా మరుగునపడింది.

ఇప్పుడు కాల్ మనీ వ్యవహారం కూడా అలాగే కాదన్న గ్యారెంటీ ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ కు ఫిర్యాదు చేస్తే.. ఆయన చిరునవ్వుతో కంప్లయింట్ తీసుకోవడం తప్ప.. వాస్తవానికి ఏమీ చేయలేరని అందరికీ తెలుసు. గవర్నర్ కు చర్యలు తీసుకోవాలని ఉన్నా.. తనకు ఉన్న పరిమిత అధికారాలతో ఆయన డైరెక్ట్ గా ఏమీ చేయలేరు. ఒక వేళ చర్యలకు సిద్ధపడినా.. తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.

ఈ విషయం అర్థం చేసుకుని.. జగన్ కేంద్రానికి ఫిర్యాదు చేసినా.. వచ్చే ఫలితం మాత్రం ఏదీ ఉండదు. ఎందుకంటే.. టీడీపీ నేతల తప్పుఒప్పులు ఉన్నాయా లేదా అన్నది ఇప్పటివరకూ తేలని విషయం. కానీ.. ఫిర్యాదు వెళ్లేది టీడీపీ నేతలపైనే కాబట్టి.. కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా కూడా ఉంది కాబట్టి.. అక్కడ కూడా పెద్దగా రియాక్షన్ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న సుజనాచౌదరిపై రీసెంట్ గా వచ్చిన ఆరోపణలు.. వారం రోజుల్లోపే గాల్లో కలిసిపోయాయి. ఆ ముచ్చట ఏమైందో.. ఎలా ముగిసిందో ఎవరికీ తెలియదు.

ఇప్పుడు కాల్ మనీపై జగన్ ఫిర్యాదు కూడా ఇలాగే ఎలాంటి రిజల్ట్ ఇవ్వకుండా పోతుందని కొందరంటున్నారు. ఈ విషయం జగన్ కు ఎప్పుడు అర్థమవుతుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -