Thursday, May 9, 2024
- Advertisement -

పౌరుషానికి పోతే ఏమైతుందో తెలుసా…

- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను పరిశ్రమ డైవర్ట్ చేసేసింది. గతంలో మాదిరిగా కామ్‌గా కూర్చోనీయకుండా అనవసర పౌరుషాలకు దిగేలా చేస్తూ….రెచ్చగొట్టేస్తోంది. ఇలా అనే కంటే ఆల్రెడీ రెచ్చగొట్టేసిందంటే మరీ మంచింది.

 

మెగా హీరోలు,మహేష్ తో తప్ప సినిమాలు తీయడం రాదని లేనిపోని అబాండాలు మీద వేసుకుని త్రివిక్రమ్ ఇబ్బంది పడుతూ వస్తున్నాడు.ఇపుడు దానికి చెక్ పెట్టడం ఎలాగో తెలియక మనోడు ఇలా బుక్ అయిపోతాడని ఎవ్వరూ ఊహించలేదు. నితిన్ తో సినిమాకు కమిట్ కావడంతోనే త్రివిక్రమ్ ఏదో చేస్తున్నాడని రకరకాల కామెంట్లు మరీ ఎక్కువైపోయాయి.త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ డైలాగ్స్ కు నితిన్ సెట్ అవ్వడనే కామెంట్ ఉంది.మరి అలాంటప్పుడు మాటల మాంత్రికుడు ఏం చూసి నితిన్ తో సినిమా చేస్తున్నాడని క్వశ్చన్ చేస్తున్నారు.దీనికి తోడు ఈసినిమాకు తన టీం మొత్తాన్ని త్రివిక్రమ్ మార్చేశాడు.

 

త్రివిక్రమ్ తో రెగ్యులర్ గా చేసే కొందరు టెక్నీషియన్స్ అతనితో పాటే జర్నీ చేస్తూ వస్తున్నారు.అయితే ఒక్క హీరో విషయంలోనే అని కాకుండా టెక్నీషియన్స్ విషయంలో కూడా ఈ డైరెక్టర్ గారు కొన్ని నిందలు మోయాల్సి వస్తోంది.వినాయక్ చోటా కే నాయుడు లేకపోతే ఎలా పని చేయలేడో అదే రీతిలో కెమేరా మెన్ మూరెళ్ల ప్రసాద్ లేకపోతే త్రివిక్ర‌మ్ అలా వర్క్ చేయలేడని కామెంట్స్ ను గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నాడు.దీనికి చెక్ పెట్టాలని చెప్పి మణిరత్నం చిత్రాలకు అప్పట్లో వర్క్ చేసిన రాజీవ్ మీనన్ ను తన సినిమాకు ఓకే చేయించుకున్నాడు.

 

త్రివిక్రమ్ చిత్రాల్లో దేవిశ్రీ లెక్క ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్లర్లేదు.అతని సినిమాలన్నింటికి దేవి శ్రీ మంచి వినసొంపైన పాటలనందించి ఎప్పుడూ సేవ్ చేస్తూ వస్తున్నాడు. కాని ఈసారి మ్యాటర్ మరోలా ఉంది. పోయి పోయి తమిళతంబీ అనిరుద్ ను పట్టుకోవడం చర్చనీయాంశమైంది.అంటే ఒక్క హీరో విషయంలోనే అని కాకుండా అటు కెమేరా మెన్ ,మ్యూజిక్ డైరెక్టర్ మ్యాటర్లోను త్రివిక్రమ్ తన టీంలో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చాడు.ఇలాగైనా తన ఫ్లేవర్లో మార్పు వస్తోందని తన సత్తా ఏంటో చూపించాలని మాటల మాంత్రికుడు ఆశపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

 

త్రివిక్రమ్ సడన్ గా తీసుకుంటోన్న ఈ నిర్ణయాలు చూస్తుంటే…ఎవ్వరికీ ఏమీ అర్ధం కావడం లేదు.ఎవరో ఏదో అన్నారని మరీ లైమ్ లైట్లో లేకుండా పోయిన టెక్నీషియన్స్ తో…. అతను ఏం చేస్తాడని కొత్త కామెంట్స్ ను ఫేస్ చేయాల్సి వస్తోంది. తీసుకుంటే కనీసం ఫామ్ లో ఉన్న వారిని తీసుకోవాలి గాని డాక్యుమెంటరీలు తీసే రాజీవ్ మీనన్ లాంటి వారిని  ఎలా తీసుకుంటారంటూ త్రివిక్రమ్ ను కొందరు పరిశ్రమలో ప్రశ్నిస్తున్నారు.ఎవరి మీదనో వచ్చిన కోపంతో తన కెరియర్ ను స్పాయిల్ చేసుకుంటున్నాడా లేక సంస్కరించుకుంటున్నాడా అంటూ కొత్త కొత్త కామెంట్స్ ను ఫేస్ చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -