Wednesday, May 8, 2024
- Advertisement -

టాలీవుడ్ మార్కెట్ కోసం తమిళ హీరోలు ఏం చేస్తున్నారో తెలుసా..!

- Advertisement -

టాలీవుడ్ హీరోలంతా కోలీవుడ్ పై పట్టు సాధించాలని చూస్తుంటే…. తమిళ తంబీలు మాత్రం తెలుగు మార్కెట్లో వాటాకోసం అర్రులు చాచుచున్నారు. దానికోస‌మ‌ని చెప్పి తమిళ  తంబీలంతా వచ్చి మన మీద పడిపోతున్నారు.

తెలుగులో ఎలాగైనా  సరే…. తమ మార్కెట్  పెంచుకోవాలని చూస్తున్నారు. తమ సినిమాలను రీమేక్ చేసుకుంటామంటే…. ఇచ్చేది లేదని భీష్మించుకు కూర్చుంటున్నారు.

ఎలాగైనా సరే తమ ఫేస్ ను తెలుగువారు రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా… బలవంతంగా నైనా మనకు ఇంజెక్ట్ చేయాలని చూస్తున్నారు. దానిలో భాగంగా సూర్య,కార్తిలు రకరకాల వేషాలతో మన ముందుకు వస్తుంటే…..కోలీవుడ్లో సెటిలైన నెల్లూరు కుర్రాడు విశాల్ సైతం… తెలుగు మార్కెట్ కోసం తహతహ లాడుతున్నాడు.ఇక శ్రీరామ్ ,జీవాలకు తెలుగులో పట్టు దొరికినట్లే దొరికి సడలిపోతోంది.

కాని ఏదో ఒక రోజు గ్రిప్ సాధిస్తామ‌ని చెబుతున్నారు.

టాలీవుడ్లోకి వస్తోన్న నేటి తరం త‌మిళ హీరోల్లో ఎవరికీ…. తెలుగుపై ఆశించనంత స్థాయిలో గ్రిప్ లేదు. ఒక వేల బిజినెస్ జరిగిందంటే అది కచ్చితంగా దర్శకులను చూసి జరుగుతుందే. ఈవిషయంలో హీరోల మ్యాట‌ర్ కొస్తే…  కమల్ ,రజనీలు మాత్రం ఇందులో ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే రెండున్నర దశాబ్దాల క్రితమే వీరిద్దరికి తెలుగులో మార్కెట్ వచ్చేసింది. అది అప్పటినుంచి ఏదో ఒక రకంగా సినిమా సినిమాకు తగ్గుతూ పెరుగుతూ వస్తుంది తప్ప …. పోవడం అయితే జరగలేదు.స్టిల్ తెలుగు అగ్ర హీరోల చిత్రాలకు ధీటుగా వీరిద్దరి చిత్రాల దందా జరుగుతోంది. వీరిద్దరి చిత్రాలు తెలుగులో మాక్జిమమ్ డబ్ అయి వచ్చినవే తప్ప…. తెలుగులో ఇంకొకరితో రీమేక్ కాలేదు.

రజనీ,కమల్ సంగతులు ఇలా ఉంటే…. విజయ్ ,అజిత్ ల ముచ్చట మరోలా ఉంది. ఇద్దరూ… ప్రజెంట్ కోలీవుడ్‌లో టాప్ హీరోలే. కానీ వీరిద్దరికీ తెలుగులో అంతగా  సినిమా లేకుండా పోయింది. ధనుష్ చేసే ప్రయోగాలు కేవలం కోలీవుడ్ కు మాత్రమే పరిమితమైపోయాయి. విజయ్ తుపాకీతో వచ్చి స్పేహితుడని చెప్పినా… పులి అంటూ పౌరుషం చూపిస్తానని ప్రామిస్ చేసినా…  డైరెక్టర్ గా స్వీకరించే స్థితిలో మన తెలుగు ప్రేక్షకుడు ఇంకా  ఎదగలేదు. సో తమిళ తంబీలను రిసీవ్ చేసుకోవడానికి ఇంకొంతకాలం పట్టొచ్చు. అప్పుడు కూడా ఆచిత్రాలు యూనివర్సల్ స్టోరీలతో వస్తేనే లైక్ చేస్తారనేది కాదనలేని సత్యం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -