Sunday, April 28, 2024
- Advertisement -

త్రివిక్రమ్ డైరెక్టర్ కాకముందు ఏం చేసేవారంటే..?

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనీవాస్.. ఇప్పుడు ఈ దర్శకుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్. అతడు, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ, వరస బెట్టి సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు. అయితే త్రివిక్రమ్ సినిమాలు చేయకముందు ఏం ఉద్యోగం చేసేవారో తెలుసా..? ట్యూషన్ మాస్టర్.

ఆంధ్రా యూనివర్శిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ ఎంఎస్సీ చదివి గోల్డ్ మెడల్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్ వచ్చారు. ఇండస్ట్రీలో సినీ అవకాశాలు రాకపోవడంతో బతుకుదెరువు కోసం హాస్య నటుడు గౌతం రాజు పిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టారు. అలా నెమ్మదిగా సినీ పరిశ్రమలో పరిచయాలు పెంచుకుని చిన్నప్నట్నుంచి తెలుగు సాహిత్యం మీద తనకున్న పరిజ్ఞానంతో మాటల రచయితగా సినిమాల్లో అడుగుపెట్టారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

అలా అలా నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు తిరుగులేని పేరు వచ్చింది. తర్వాత తరుణ్ తో నువ్వే నువ్వే తీసి మంచి సక్సెస్ అందుకున్న తర్వాత మహేష్ బాబుతో అతడు సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరస సూపర్ హిట్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -