Sunday, May 19, 2024
- Advertisement -

ఆ నిర్మాత గే… ఓ రాత్రి గడపాలని ఒత్తిడి!

- Advertisement -

#మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళ‌లు మాత్ర‌మే తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వెల్ల‌డించ‌డం జ‌రిగింది.తాజాగా ఓ నటుడు తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పి ఆశ్చర్యపరిచాడు.రాహుల్ రాజ్ సింగ్ .. ప‌లు హిందీ సీరియ‌ల్స్‌లో న‌టిస్తు మంచి పేరు సంపాదించాడు.అయితే ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న సమయంలో నిర్మాత ముస్తాక్ షేక్ తనను లైంగికంగా వేధించాడని వెల్లడించాడు.ఓ రోజు రాత్రి 11 గంటలకి ఫోన్ వస్తే ముస్తాక్ ఇంటికి వెళ్లాను. అతడి బెడ్ రూమ్ లో పోస్టర్లు చూశాక పరిస్థితి అర్ధమైంది. నేను ఓ పని చేయబోతున్నా.. నీకు చాలా సంతోషంగా ఉంటుందని అన్నాడు.

మీ కుటుంబానికి చెప్పేస్తానని బెదిరిస్తే మరోసారి ట్రై చేద్దామని అన్నాడు.ఓ రోజు ముస్తాక్ నుంచి కాల్ వ‌చ్చింది.నేను నిన్నే సెలెక్ట్ చేశానని ముస్తాక్ అన్నాడు. ఓ షో చేయడానికి ఒప్పుకున్నా.. అయితే తనతో ఓ రాత్రి గడపాలని, లేదంటే షో నుండి తీసేస్తానని బెదిరించాడు.మరోసారి అతడితో కారులో ప్రయాణం చేయాల్సివస్తే నా షర్ట్ బటన్స్ విప్పడం మొదలుపెట్టాడు. దీంతో కారు దిగి వెళ్లిపోయాను. అతడి కారణంగానే టీవీ ఇండస్ట్రీని వదిలిపెట్టాల్సి వచ్చింది. ముస్తాక్ గే సెక్స్ వేధింపులు భరించలేకపోయాన‌ని మీడియా ఎదుట త‌న బాధ‌ను చెప్పాడు రాహుల్ .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -