Thursday, May 8, 2025
- Advertisement -

పెళ్లికి రెడీ అయిన మధుబాబు, ప్రియాంక..!

- Advertisement -

అభిషేకం సీరియల్ తో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న నటుడు మధుబాబు. జీ తెలుగు లో ప్రసారమైన మంగమ్మగారి మనవడు సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయమైన మధు మొదటి సీరియల్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అక్క చెల్లెలు, అభిషేకం సీరియల్ వంటి సీరియల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

అయితే రీసెంట్ గా తన పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడు మధు. నా లైఫ్ లో ముఖ్యమైన ఈవెంట్ ని అనౌన్స్ చేయడానికి సంతోషిస్తున్నాను. నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. మీలో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. నేను పెళ్లి చేసుకునేది ప్రియంక నాయుడు. మధు పెళ్లి చేసుకోబే ప్రియాంక నాయుడు ఎవరో కాదు. తను కూడా సీరియల్ నటే. ప్రస్తుతం వదినమ్మ సీరియల్ లో సిరి క్యారెక్టర్ లో నటిస్తున్న ఆమె. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు.

పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకోవాలని ఇన్ని రోజులు వెయిట్ చేశారు. మథర్స్ డే రోజున మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చింది. నాకు సపోర్ట్ చేసిన అమ్మ నాన్నకి చాలా థ్యాంక్స్ అంటూ మెన్షన్ చేస్తూ తన వెడ్డింగ్ న్యూస్ ని అందరితో పంచుకున్నాడు మధు. మధు పోస్ట్ చూసినవారందరూ మీ ఇద్దరి జోడి చాలా సూపర్ అంటూ కామెంట్స్ పెడుతూ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -