Wednesday, May 15, 2024
- Advertisement -

అవకాశాలిప్పిస్తానని వాడుకున్నాడు… బుల్లితెర‌ న‌టి స‌మీరా

- Advertisement -

కాస్టింగ్ కౌచ్ అనేది వెండితెర‌తో పాటు బుల్లితెర‌కు కూడా పాకిన‌ట్లుంది. సీరియ‌ల్స్‌లో న‌టించే వారికి కూడా ఈ బాధ‌లు త‌ప్ప‌డం లేద‌ని తెలుస్తుంది. టీవీ సీరియల్స్ లో అవకాశాలు ఇప్పిస్తానని ఓ వ్య‌క్తి తనను దారుణంగా మోసం చేశాడని టీవీ న‌టి స‌మీరా ఆరోపించింది. తమది గుంటూరు జిల్లా అని, టీవీల్లో నటిస్తూ, దుబాయ్ లో ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నానని చెప్పింది.

గుట్కా వ్యాపారం చేస్తున్న విజయవాడకు చెందిన ఫిరోజ్ ఖాన్ పరిచయం కాగా, తామిద్దరం కొంతకాలం ప్రేమించుకున్నామని చెప్పింది. అతను అండగా ఉంటాడని నమ్మానని అంది. మనస్పర్థలు వచ్చి తామిద్దరం విడిపోయామని చెప్పింది. ఆ తరువాత కీర్తితో ఫిరోజ్ పరిచయం పెంచుకున్నాడని, తన చేతులపై బ్లేడుతో కీర్తే గాట్లు పెట్టిందని చెబుతూ వాటిని మీడియాకు చూపింది. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే వారిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -